గొల్లపూడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి | CM KCR shocked on osmania medical college students died incident | Sakshi
Sakshi News home page

గొల్లపూడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Published Tue, Mar 15 2016 8:10 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM

గొల్లపూడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి - Sakshi

గొల్లపూడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం, సహాయక చర్యలను పర్యవేక్షించాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

మృతిచెందిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులకు కేసీఆర్ సానుభూతి తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్), విజయ్ తేజ (కుత్బుల్లాపుర్), ఉదయ్ (కరీంనగర్), గిరి లక్ష్మణ్ (ఆదిలాబాద్), డ్రైవర్ వేముల శివయ్య లను మృతులుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement