
సాక్షి ,సిటీబ్యూరో: ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న19 మంది విద్యార్థులు అస్వసత్థకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో బాధపడటంతో అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.