సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తాజాగా 12 మంది ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం ఉస్మానియా మెడికల్ రీడింగ్ రూమ్‌ను మూసివేసింది. జూనియర్ డాక్టర్లకు కరోనా సోకడంతో కళాశాల మొత్తం శానిటైజింగ్ చేయించినట్లు ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. మిగతా మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న 10 హాస్పిటల్స్ లోని వివిధ విభాగాల్లో జూనియర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. కాగా తోటి స్నేహితులకు కరోనా సోకడంతో మిగతా విద్యార్థులంతా భయాందోళనకు గురవుతున్నారు. (‘కరోనాకు మందు కనిపెట్టా.. అనుమతివ్వండి’)
Comments
Please login to add a commentAdd a comment