ఉస్మానియా వైద్య కళాశాలలో ‘ఎంసీఐ’ తనిఖీ | MCI Check in Osmania Medical College | Sakshi
Sakshi News home page

ఉస్మానియా వైద్య కళాశాలలో ‘ఎంసీఐ’ తనిఖీ

Published Fri, Mar 10 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

ఉస్మానియా వైద్య కళాశాలలో ‘ఎంసీఐ’ తనిఖీ

ఉస్మానియా వైద్య కళాశాలలో ‘ఎంసీఐ’ తనిఖీ

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా వైద్య కళాశాలలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) పరిశీలకులు తనిఖీ నిర్వహించారు. గతంలో తనిఖీకి వచ్చినపుడు లోపాలు కనిపించడంతో 50 ఎంబీబీఎస్‌ సీట్లకు కోతపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి తనిఖీ నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

 అయినా సిబ్బంది క్వార్టర్ల నిర్మాణంలో జాప్యంపై ఎంసీఐ పరిశీలకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటితోపాటు మరికొన్ని లోపాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో వాటినికూడా సరిచేస్తామని అధి కారులు హామీ ఇచ్చారు. కోతకు గురైన 50 సీట్ల పునరుద్ధరణ త్వరలోనే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement