
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వై.జతిన్ ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ప్రవేశ పరీక్షలో దేశవ్యాప్త మొదటి ర్యాంకు సాధించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 2014లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన జతిన్.. తర్వాత 2015–18 వరకు చండీగఢ్‌లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఎయిమ్స్ నిర్వహించిన ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంకు సాధించడం పట్ల జూనియర్ డాక్టర్లు (జూడా) హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్‌కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment