కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు సోమవారం తరగతులు బహిష్కరించారు.
హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు సోమవారం తరగతులు బహిష్కరించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. ఇటీవల విజయవాడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే.