
చిత్తూరు అర్బన్: తొలిరాత్రి శోభనం గదిలో భార్యను చిత్రహింసలకు గురిచేశాడనే ఆరోపణలపై జుడీషియల్ రిమాండులో ఉన్న ఉపాధ్యాయుడు రాజేష్‌కు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1న శోభనం గదిలో భార్య శైలజపై విచక్షణ మరిచి దాడి చేయడంతో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు రాజేష్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు పూర్తి కావడంతో శుక్రవారం అతడిని పోలీసులు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. లైంగిక పటుత్వ పరీక్షలకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో గతవారం అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం తిరిగి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.