
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. పెళ్లైన తొలిరాత్రి తనకు మగతనం లేదనే విషయాన్ని బయటపెట్టినందుకు భార్య శైలజను రాజేష్ పైశాచికంగా హింసించిన ఘటన ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేష్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని గంగాధరనెల్లూరు పోలీసులు కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలిచ్చింది. రెండు రోజుల కిందట పోలీసులు రాజేష్‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి హైదరాబాదుకు తీసుకెళ్లారు. ఉస్మానియా వర్సిటీలో శుక్రవారం అతనికి శారీరక ప్రమాణాల పరీక్షలు జరిపిన అక్కడి ఫోరెన్సిక్ విభాగ వైద్య బృందం శనివారం లైంగిక పటుత్వ పరీక్షలు చేపట్టింది. ఫలితాలను పోలీసులు కోర్టుకు అందజేసి, తదుపరి కేసు దర్యాప్తునకు సిద్ధమవుతున్నారు.