చిత్తూరు: మొదటి రాత్రే భార్యను చితకబాదిన కేసులో నిందితుడు రాజేష్‌కు హైదరాబాద్‌లోని ఫోర్సెనిక్ ల్యాబ్‌లో పటుత్వ పరీక్షలు నిర్వహించాలని చిత్తూరు కోర్టు పోలీసులను ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు. చిత్తూరుజిల్లా గంగాధర నెల్లూరు మండలం చిన్నదామరగుంటకు చెందిన శైలజ, అదే మండలానికి చెంది వి.కోట మండలం ఆధీనపల్లిలో టీచర్‌గా పనిచేసే రాజేష్‌కు ఈ నెల 1వ తేదీన వివాహమైంది. చిన్నదామరగుంటలో మొదటి రాత్రి పెళ్లి కుమార్తె గదిలోకి వెళ్లిన రెండు గంటలకు గది లోంచి ఏడుపు శబ్దాలు వచ్చాయి. తమ కుమార్తెను రాజేష్ కొట్టాడని శైలజ తల్లిదండ్రులు తెలుసుకుని గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. మొదట 336, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శైలజ శరీరంపై దెబ్బల తీవ్రత చూసి అతని లైంగిక పటుత్వం తెలిసి కూడా మోసం చేశారంటూ అతని తల్లిదండ్రులు కుమారస్వామి రెడ్డి, రమీలను కూడా కేసులో చేర్చి తల్లి ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. రాజేష్‌కు పటుత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. దీంతో ఏమైనా అభ్యంతరం ఉంటే ఈనెల 8లోగా తెలుపమని న్యాయమూర్తి ఆదేశించారు. 6వ తేదీన రాజేష్ తరపున పిటిషన్ వేసిన న్యాయవాది రెండు రోజులపాటు తన వాదనలు వినిపించారు. రాజేష్‌కు హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పటుత్వ పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment