శాడిస్ట్‌ మొగుడు రాజేష్‌కు బెయిల్‌ | Chittor Court Grants Bail to Sadist Hubby Rajesh | Sakshi
Sakshi News home page

శాడిస్ట్‌ మొగుడు రాజేష్‌కు బెయిల్‌

Published Thu, Jan 18 2018 6:31 PM | Last Updated on Thu, Jan 18 2018 7:03 PM

Chittor Court Grants Bail to Sadist Hubby Rajesh - Sakshi

శాడిస్టు భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన భార్య శైలజ

సాక్షి, చిత్తూరు : తొలిరాత్రిని కాళరాత్రిగా మార్చిన శాడిస్ట్‌ భర్త రాజేష్‌కు బెయిల్‌ మంజూరైంది. పటుత్వ పరీక్షల రిపోర్టులో రాజేష్‌ సంసార జీవితానికి పనికి వస్తాడని తేలడంతో అతనితో పాటు అతని తల్లిదండ్రులకు కూడా చిత్తూరు జిల్లా కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బెయిల్‌పై విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేష్‌ తల్లిదండ్రులు శైలజ కావాలనే రాజేష్‌ను జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. గతేడాది నవంబర్‌ 1తేదీన గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన మునికృష్ణా రెడ్డి కుమార్తె శైలజను, జీడి నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌కు ఇచ్చి వివాహం చేశారు.

అయితే, తొలిరాత్రి నాడు రాజేష్‌ సంసార జీవితానికి పనికి రాడంటూ శైలజ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో రాజేష్‌ మృగంలా మారిపోయాడు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. అతడి వికృత చేష్టలకు తీవ్రంగా గాయపడింది శైలజ. తొలిరోజే ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో నవ వధువు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ముఖం గుర్తించలేనంతగా గాయాలతో కమిలిపోయింది. పెళ్లిపీటలపై అందంగా కనిపించిన శైలజ అదే రోజు రూపం మారిపోయి చిత్తూరు ఆస్పత్రిలో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement