‘చరణ్‌తో మీ బిడ్డ పెళ్లి చేయకపోతే ప్రాణ నష్టం’ | Chittoor B Kothakota Fake Baba Cheat Family By Threatening With Death | Sakshi
Sakshi News home page

‘చరణ్‌తో మీ బిడ్డ పెళ్లి చేయకపోతే ప్రాణ నష్టం’

Published Thu, Jan 28 2021 7:46 PM | Last Updated on Thu, Jan 28 2021 8:22 PM

Chittoor B Kothakota Fake Baba Cheat Family By Threatening With Death - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు: మదనపల్లె లాంటి సంఘటనలు చూస్తే.. సాంకేతికత మీద మూఢనమ్మకాలదే గెలుపు అనిపిస్తుంది. మనలోని భయం మన చేత అలా చేయిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగ స్వామీజీలు, బాబాలు జనాలను మోసం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన చిత్తూరు బి కొత్తకోటలో చోటు చేసుకుంది. పూజల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి తన అనుచరుడు చరణ్‌తో కలసి దందాలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో వెంకట్‌ రెడ్డి కన్ను స్థానికంగా ఉన్న కృష్ణా రెడ్డి కుటుంబం మీద పడింది. 
(చదవండి: బంగారు తల్లులను చంపేసుకున్నాం.. సారీ డాడీ!)

ఈ క్రమంలో ‘‘మీ బిడ్డను ఫలానా వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలి. లేకుంటే కుటుంబంలో ప్రాణ నష్టం తప్పదు’’ అని వెంకట్‌ రెడ్డి.. కృష్టా రెడ్డిని బెదిరించాడు. అతడి మాటలతో బెంబెలేత్తిన కృష్టా రెడ్డి మెడిసిన్‌ చేస్తోన్న తన కుమార్తెని వెంకటరెడ్డి అనుచరుడు చరణ్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇక పెళ్లైన కొద్ది రోజులకే చరణ్‌ భార్యను చిత్ర హింసలకు గురిచేయడం ప్రారంభించాడు. మోసపోయామని తెలిసి కృష్టా రెడ్డి కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement