
చీరకట్టు... అదిరేట్టు
గాంధీ ఆస్పత్రి : గాంధీ మెడికల్ కాలేజీ 2కే12 బ్యాచ్ నేతృత్వంలో జరుగుతున్న ఇతిహాస్ ఫెస్ట్‌లో భాగంగా మెడికోలు సంప్రదాయ దుస్తులు, చీరలు, పంచెలు ధరించి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ ఆట పాటలతో ఆహ్లాదాన్ని పంచారు. క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్‌తో పాటు, మెహిందీ, వాట్సప్ సింబల్స్ టాటూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.