khuran
-
దానధర్మాలపై ఖురాన్ ఏం చెబుతోంది?
తమ సంపదను దైవ మార్గంలో ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక్క విత్తనాన్ని నాటితే అది మొలిచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదేవిధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింప జేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడూను. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తర్వాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహీతల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ ఖేదం కాని ఉండవు. మనసును గాయపరిచే దానం కంటే మృదుభాషణం. క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికి అతీతుడు, అత్యంత సహనశీలుడూను. విశ్వసించిన ఓ ప్రజలారా! కేవలం పరుల మెప్పును పొందడానికే తమ ధనం ఖర్చు చేసే వాని మాదిరిగా..... మీరు దెప్పి పొడిచి గ్రహీత మనస్సును గాయ పరిచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధనవ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు: ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకు΄ోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండ రాయి మాత్రమే. ఇలాంటివారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు. (నిస్సహాయతలోనూ.. దేవుని వైపే)(దివ్య ఖుర్ఆన్: 2:261–264)వివరణ: మనం ఎవరికైనా దానం ఇచ్చి దెప్పి పొడవడం సరైన పద్ధతి కాదు. కుడి చేతితో దానం చేసిన విషయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. కాబట్టి మనం చాటుమాటుగా దానం చేయాలి. అది దేవుని ప్రీతి కోసం మాత్రమే చేయాలి. ప్రదర్శన బుద్ధి కోసమో పేరు ప్రఖ్యాతల కోసమో చేయకూడదు. మీరు చేసిన దానం దేవుడికి తెలుసు తీసుకున్న వాడికి తెలుసు అంతే కానీ మూడో వ్యక్తికి తెలియకుండా ఉండడమే దైవ భక్తికి నిదర్శనం. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
చెడుల నిర్మూలనకు కంకణ బద్ధులు కావాలి
ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలి. నేడు సమాజంలో ఎటు చూసినా చెడులు, దుష్కార్యాలు పెరిగిపోతున్నాయి. మానవ జీవితంలోని అన్ని రంగాలనూ ఈ రుగ్మతలు పరివేష్టించాయి. చెడులతో పోల్చుకుంటే మంచి తక్కువగా కనబడుతోంది. నిజానికి మంచి అన్న మేరు పర్వతం ముందు చెడు చీడ పురుగులా గోచరించ వలసింది. కాని దురదృష్ట వశాత్తూ దుర్మార్గమే దొడ్డుగా ఉన్నట్లు కనబడతా ఉంది. ఈ దుస్థితి మారాలి. మార్చాల్సిన బాధ్యత సమాజ శ్రేయోభిలాషులందరిపై ఉంది. ముఖ్యంగా దైవ విశ్వాసులపై మరీ అధికంగా ఉంది. దుర్మార్గాల నిర్మూలన, సత్కార్యాల స్థాపన పైనే మానవాళి సాఫల్యం ఆధారపడి ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను గుర్తు చేస్తూ పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది: ’ మీలో కొందరు, ప్రజలను మంచి వైపుకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆజ్ఞాపించే వారు, చెడులనుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇహపర లోకాలలో సాఫల్యం పొందేవారు’..(3 –104). మరొక చోట:, ’విశ్వాసులారా! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరే.. మీరు సత్కార్యాలు చేయమని ప్రజలను ఆదేశిస్తారు, దుష్కార్యాలనుండి వారిస్తారు. దైవాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు’ అని చెప్పబడింది. (3–110) పవిత్ర ఖురాన్‌లోని ఈ వాక్యాలు దైవ విశ్వాసుల జీవిత లక్ష్యం ఏమిటో, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలేమిటో విశదీకరించాయి. దీన్నిబట్టి ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను అరికడుతూ, మంచిని, మానవీయ విలువలను వ్యాపింపజేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలని మనకు అర్ధమవుతోంది. అందుకే పవిత్ర ఖురాన్, ప్రజల్లో దైవ భీతిని, పరలోక చింతనను జనింపజేసి తద్వారా వారిని నీతిమంతులుగా, సత్పౌరులుగా తీర్చిదిద్దాలని అభిలషిస్తోంది. మూఢనమ్మకాలు, దురాచారాలతో సహా ప్రపంచంలోని అన్నిరకాల చెడులను నిర్మూలించి చక్కని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పదలిచింది. ఈ లక్ష్యసాధన కోసం పవిత్ర ఖురాన్ దైవ విశ్వాసులపై మంచిని పెంచే, చెడును నిర్మూలించే బృహత్తర బాధ్యత ను నిర్బంధం చేసింది. దీనికోసం దైవ విశ్వాసులు ఒక సంఘటిత శక్తిగా రూపొందాల్సిన ఆవశ్యకతను అది గుర్తు చేస్తోంది. – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
టాలెంట్‌కు వయసుతో సంబంధమేముంది
టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదనే మాటకు బాలీవుడ్ నటి నీనా గుప్త (62) ఆదర్శంగా నిలిచారు. ఆరుపదుల వయసులో గతేడాది విడుదలై ఘనవిజయం సాధించిన ముల్క్, బధాయి హో చిత్రాల్లో నటించిన నీనాను ఎన్నో అవార్డులు వరించాయి. చిత్ర పరిశ్రమలో యుక్త వయసు తర్వాత మహిళలకు సినిమా అవకాశాలు రావడంలేదన్న అంశంపై ఆమె స్పందింస్తూ... ‘సీనియర్ నటీమణులకు హీరోయిన్గా అవకాశాలు రావటం కష్టం. కథానాయికగా చేయనంత మాత్రాన వారు అందంగా లేరని కాదు. వారిని కొన్ని పాత్రలకే పరిమితం చేయటం సరైంది కాదు. ఈ విషయంలో బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ‘నటుడు ఆయుష్మాన్ (ఖురాన్) సలహా మేరకు స్ర్కిప్ట్ పూర్తిగా చదవటం అలవాటు చేసుకున్నాను. ప్రస్తుతం ఓ హారర్ స్ర్కిప్ట్ ఉంది. అన్ని జోనర్లతో పాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించాలనుంది. కళాత్మక సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించకతే సంతృప్తినివ్వవు. కానీ, బధాయి హో కమర్షియల్‌గా కూడా విజయం సాధించటం చాలా సంతోషాన్నిచ్చింది’ అని నీనా గుప్తా చెప్పారు. ఇక జానే భీ దో యారో, బధాయి హో వంటి చిత్రాలు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘సినిమాల్లో నా రీ ఎంట్రీని ప్రోత్సహించింది నా కూతురు మసబ గుప్తా. ఇప్పుడు నా విజయాలపట్ల ఆమె ఆనందిస్తోంది. నా జీవితంలో ఈ ఆనందకరమైన మార్పుకు తనే కారణం’ అని నీనా తెలిపారు. -
ఆధ్యాత్మికతకు ‘నెల’వు
కల్హేర్(నారాయణఖేడ్) సిద్ధిపేట : నెలవంక తొంగిచూసింది.. సమతా మమతలకు స్ఫూర్తినిచ్చే రంజాన్ ముబారక్ మాసం వచ్చేసింది. ముస్లిం లోగిళ్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఇస్లాం మతం ఆశయాలు, ఆదర్శాలను నూటికి నూరుపాళ్లు ఆచరించే మాసం రంజాన్. గ్రామాలు, పట్టణాల్లో సందడి నెలకొంది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ ముబారక్ మాసం ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల పూర్తికాగానే కనిపించే నెలవంక దర్శనంతో వస్తుంది. దీంతో ముస్లింలు ‘తరావీ’ నమాజ్‌ను ఆచరించి రోజా (ఉపవాస దీక్షలు) ప్రారంభిస్తారు. రాత్రి ‘ఇషా’ నమాజ్ అనంతరం సామూహికంగా తరావీ నమాజ్ చేస్తారు. తరావీ నమాజ్‌లో పవిత్ర ‘ఖురాన్’ శ్లోకాలను పఠిస్తారు. రంజాన్ నెల ప్రారంభంలోని మొదటి భాగం కారుణ్య భరితమని, మధ్యభాగం దైవ మన్నింపు లభిస్తుందని, చివరిభాగం నరకం నుంచి విముక్తి కలిగి సౌఫల్యం ఖురాన్లో పేర్కొన్నట్లు ముస్లిం మతపెద్దలు చెబుతారు. రంజాన్ నెలలో 29 లేదా 30 రోజులపాటు ముస్లింలు వేకువజామునే ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. వేకువజామున ‘ఫజర్’ నమాజ్‌కు ముందు తీసుకునే ఆహారాన్ని ‘సహర్’ అంటారు. సాయంత్ర సూర్యాస్తమయం వేళ ‘మగ్రీబ్’ నమాజ్‌కు ముందు ఉపవాస దీక్ష ముగిస్తారు. దీక్ష విరమణ కోసం ‘ఇఫ్తార్’ చేస్తారు. ఉపవాస దీక్షలతోపాటు క్రమం తప్పకుండా ఐదు పూటలు నమాజ్, ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేస్తారు. షవ్వాల్ నెల చంద్రున్ని చూసి మరుసటి రోజు యావత్తు ముస్లింలు ‘ఈద్ ఉల్ ఫితర్’.. నమాజ్ ఆచరించి చేసుకునే పండుగే రంజాన్. పవిత్ర గ్రంథం ‘ఖురాన్’ రంజాన్ నెలలోనే అవతరించింది. రంజాన్ మాసం ముస్లింలకు ఒక నైతిక శిక్షణలాంటిదని, ఉపవాస దీక్షలతోపాటు ఐదువేళల్లో నమాజ్ చేయడం వల్ల క్రమశిక్షణ, తల్లిదండ్రులు, పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా, పిల్లల పట్ల ప్రేమాభిమానాలతో మెలగడం తెలుస్తుందని ముస్లింలు పేర్కొంటున్నారు. ఇస్లాం పయనం ఇలా.. ఇస్లాం మతం ఐదు ముఖ్య మూలస్తంభాలపై ప యనిస్తుంది. అందులో మొదటిది ‘కల్మా’ (దేవున్ని విశ్వసించడం), రెండోది ప్రతిరోజు ఐదువేళల్లో నమాజ్ ఆచరించడం, మూడోది రంజాన్ మా సంలో ఉపవాస దీక్షలు పాటించడం, నాలుగోది ‘జకాత్’ రూపంలో పేదలకు దానధర్మాలు చేయడం, ఐదోది ‘హజ్’ (మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం) యాత్ర చేయడం. ఈ ప్రధాన ఐదు సూత్రాలను ముస్లింలు పాటిస్తారు. రంజాన్ నెల లో పాటించే పద్ధతులు విజయవంతమైన జీవనానికి భరోసా ఇస్తాయి. ఉపవాస దీక్షల్లో ఉంటూ ఐదు వేళల్లో నమాజ్ చేస్తే మనోధైర్య, సహనం, ఆత్మస్థైర్యం, ధాతృత్వం పెంపొందుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్లో రంజాన్ ‘సర్దార్’.. రంజాన్ మాసంలో నమాజ్ చదువుతూ భగవంతున్ని స్మరించుకుంటారు. పవిత్ర గ్రంథం ఖురాన్ పఠిస్తూ దేవుని స్మరణలో లీనమైపోతారు. ఇస్లామిక్ మాసాల్లో అన్నింటికంటే రంజాన్ నెల చాలా గొప్పది. భగవంతుడు అన్ని మాసాల్లో రంజాన్ మాసాన్ని సర్దార్ చేసినట్లు ముస్లిం మత పెద్దలు చెపుతున్నారు. రంజాన్ మాసం చాలా బర్కత్ ఇస్తుంది. పవిత్ర గ్రంథం ఖురాన్ రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది. ప్రవక్త ‘హుజూర్పాక్ సల్లెల్లాహు అలైహి వసల్లాం’ రంజాన్ నెలలో ‘అల్లాహ్’కి బందెగి కర్నె కేలియే బహుత్ జ్యాదా తాకిర్ కరే.. అని ముస్లింలు భావిస్తున్నారు. రంజాన్ నెల 27న రాత్రి ‘షబ్ ఏ ఖదర్’ జరుపుకుంటారు. రాత్రి (ఇబాదత్) జాగరణ చేస్తూ భగవంతుడిని తలుచుకుంటారు. షబ్ ఏ ఖదర్ రోజు ఇబాదత్ చేస్తే వెయ్యి మాసాల ‘సవాబ్’ (దేవుడి ఆశీస్సులు) దొరుకుతుంది. సహర్‌తో రోజా ప్రారంభం.. రంజాన్ మాసంలో తెల్లవారు జామునలో ఫజర్ నమాజ్‌కు ముందు రోజా ఉండేందుకు ముస్లింలు ‘సహర్’ చేస్తారు. సహర్‌కు ముందు ఆహారం తీసుకుంటారు. అనంతరం ఉపవాస దీక్ష కఠిన ంగా పాటిస్తారు. కనీసం మంచి నీరు కూడా తీసుకోరు. రోజా ముగింపు సందర్భంగా సాయంత్రం ‘ఇఫ్తార్’తో దీక్షను విరమిస్తారు. ఇఫ్తార్‌లో పండ్లు, ఇతర తీపి పదార్థాలు తీసుకుంటారు. లేకుంటే కనీసం ఒక ఖజ్జూర పండు, కొంచెం నీరు తాగి ఇఫ్తార్ చేస్తారు. తరావి నమాజ్.. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తరావి నమాజ్ చ దువుతారు. ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇ షా నమాజులతో పాటు ప్రత్యేకంగా తరావి న మాజ్ చే యడం రంజాన్ మాసంలో ప్రత్యేకత. రంజాన్ ఆ రంభం కోసం నెల వంక దర్శనం అన ంతరం ఇషా నమాజ్ అనంతరం తరావి నమాజ్ చేస్తారు. తరా వి నమాజ్ సున్నాత్గా భావిస్తారు. 20 రకాత్లు తరావి నమాజ్ చదువుతారు. పవిత్ర గ్రంథం ఖురాన్.. మానవ జీవితం ఎలా ఉండాలో మార్గదర్శకాలను సూచించే ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్. రంజాన్ మాసంలో ‘లైలతుల్ ఖద్ర్’ (పవిత్రమైన రాత్రి) నాడు అరబ్బీ భాషలో ఖురాన్ గ్రంథం అవతరించింది. ఖురాన్లో 30 ‘పారాలు’ (భాగాలు) ఉన్నాయి. 114 సూరాలతో పాటు 14 సజ్ధాలు వస్తాయి. ఖురాన్ ఎంతో పవిత్రమైంది. ఖురాన్‌ను ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. ప్రత్యేకించి ‘రెహల్’ (చెక్కతో తయారు చేసిన) ఉపయోగించి ఖురాన్ పఠనం చేస్తారు. ఖురాన్‌ను విశ్వసించి జీవితంలో దాన్ని అమలు చేయాలి. జీవితానికి సంబంధించిన దైవాజ్ఞలను తెలుసుకొనేందుకు ప్రతీ రోజు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తూ అవగాహన చేసుకోవాలి. రంజాన్ దీక్షలు కఠినం రంజాన్ మాసంలో రోజా చేపట్టేందుకు అత్యంత కఠినంగా వ్యవహరించాలి. రంజాన్ ముబారక్ నెల చాలా గొప్పది. రోజా ఉండడం, నమాజ్, ఖురాన్ చదవడం ప్రత్యేకత. ఉపవాస దీక్షలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేపట్టాం. సహర్ కోసం నిద్ర నుంచి లేపేందుకు సైరన్ ఏర్పాటు చేశాం. – ఎండి. ఖుద్బొద్దీన్, మసీద్ కమిటీ అధ్యక్షుడు, కల్హేర్ నియమాలు పాటించాలి రంజాన్ నెలలో అన్ని నియమాలు పాటించాలి. ‘ఇమాన్వాలో ఇస్ మహినేకో జాన్కర్ రోజా రఖో’ తరావి నమాజ్, ఖురాన్ చదివితే పూరే గుణా (పాపాలు) అల్లాహ్‌తాలా మాఫీ కరేగా’ రంజాన్ నెలలో అల్లాహ్ ఇబాదత్ కర్నా చాహియే. – మౌలనా లతీఫ్, ఇమాం, కల్హేర్ -
రమజాన్ రోజాలు
పవిత్ర రమజాన్ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లిములు ఎంతో ఉత్సాహంతో ఉపవాసదీక్షలు ప్రారంభించారు. భక్తిశ్రధ్ధలతో పవిత్ర ఖురాన్ పారాయణం చేస్తున్నారు. మసీదులన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. చిన్నపిల్లలు సైతం రోజా పాటించడానికి ఉబలాటపడుతున్నారు. దీనిక్కారణం ఏమిటి? అసలు ఉపవాసం ఎందుకుండాలి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దీనికి స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు. భయభక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును,అసహ్యతను ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధికంగా మొగ్గుచూపే ఒకానొక స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవాసాల అసలు ఉద్దేశం. అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతఃశ్శుధ్ధిని కూడా పాటించాలి. ఉపవాసదీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లుకాదు. కేవలం పస్తులుండటంతో సమానం. ముహమ్మద్ ప్రవక్త(స) ఇలాచెప్పారు: ’ఉపవాసదీక్ష పాటించే చాలామందికి, తమ ఉపవాసాలద్వారా, ఆకలిదప్పుల బాధతప్ప మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’. అంటే, ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం ఎంతమాత్రం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవవిధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుంచి సురక్షితంగా ఉంచడం. ఏడాదికొకసారి నెలరోజులపాటు నైతిక విలువలు, దైవాదేశపాలనను అభ్యాసం చేయిం చడం. నెల్లాళ్ళ శిక్షణ అనంతరం మిగతా పదకొండు నెలలకాలం దీని సత్ప్రభావం జీవితాల్లో ప్రసరించే విధంగా ఏర్పాట్లుచేయడం. పవిత్ర రమజాన్‌లో ఏవిధంగా అన్నిరకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దానధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో, అలాగే మిగతా కాలమంతా సమాజంలో శాంతి, న్యాయం,ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిధ్ధించాలన్నది అసలు ధ్యేయం. ఈ రమజాన్‌లో అటువంటి తర్ఫీదు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికీ దక్కాలని మనసారా కోరుకుందాం. (రమజాన్ పర్వదినం ప్రారంభం సందర్భంగా) – యండి.ఉస్మాన్ ఖాన్ -
హైదరాబాదీ విద్యార్థుల ప్రపంచ రికార్డు
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ వ్యవధిలో ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి హైదరాబాదీ చిన్నారులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆదివారం ఆసిఫ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఎంఎస్ హిఫ్జ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖురాన్‌లోని వ్యాఖ్యలను విద్యార్థులు పఠించారు. గతంలో ఈ రికార్డు ఈజిప్టు పేరిట ఉంది. నగరంలోని 28 మంది విద్యార్థులు 11 నెలల్లోనే మొత్తం ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి రికార్డు సాధించినట్లు అకాడమీ చైర్మన్ మహ్మద్ లతీఫ్ ఖాన్ చెప్పారు. కార్యక్రమంలో పలువురు మతగురువులు పాల్గొన్నారు. -
స్త్రీ ధనం స్త్రీ గౌరవం
అన్నిటికన్నా ముందు, ఇస్లాం ధర్మం ‘స్త్రీ’ ఉనికిని, వ్యక్తిత్వాన్ని గుర్తిస్తుంది, అంగీకరిస్తుంది. పురుషుని వ్యక్తిత్వంతో స్త్రీని ముడిపెట్టదు. పురుషుని ఉనికిలో స్త్రీని నొప్పించి ఆమె ఉనికిని నిరాధారం చేయడాన్ని ఇస్లాం ఎంతమాత్రం సమ్మతించదు. పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది. సమానత్వం ‘స్త్రీ అయినా, పురుషుడైనా – సత్కార్యం చేసే వారైతే, మేము వారికి పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాం, ఇంకా పరలోకంలో వారికి వారి సదాచరణలకు అనుగుణంగా ప్రతిఫలం ప్రసాదిస్తాము. (పవిత్ర ఖురాన్. 16–97) స్త్రీ తన ముక్తి మోక్షాలకు పురుషుడిపై ఆధారపడవలసిన అవసరం లేదు. మగవారికి మహిళలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో, అలాంటి హక్కులే, ధర్మం ప్రకారం మహిళలకూ మగవారిపై ఉన్నాయి. (ఖురాన్. 2–228) వరుణ్ని ఎంచుకునే విషయంలో స్వేచ్ఛ వివాహ సమయంలో, వరుణ్ని ఎంపిక చేసుకొనే విషయంలో స్త్రీలకి సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయి. స్త్రీ ఇష్టపడడం అన్నది ఇస్లాం ధర్మంలో నికాహ్ జరగడానికి తప్పనిసరి నియమం. ‘వివాహం విషయంలో, చేసుకునే యువతి అనుమతి, అభీష్టం తప్పనిసరి’ (సహీహ్ ముస్లిం) వారసత్వపు హక్కు ‘తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు వదిలి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగం ఉన్నట్లుగానే, స్త్రీలకూ భాగం ఉంది. అది కొద్దిగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, ఈ భాగం దైవం తరపున నిర్ణయించబడింది’ (పవిత్ర ఖురాన్) మహర్ హక్కు ‘మహర్’ ధనానికి హక్కుదారు స్త్రీ. మహర్ ధనంపై ఆమెకు తప్ప మరెవరికీ అధికారం లేదు. దాన్ని ఆమె తన ఇష్టానుసారం ఖర్చు పెట్టుకునే అధికారం కలిగి ఉంటుంది. (హిదాయతుల్ ముజ్తహిద్ రెండవ భాగం 16వ పేజి.) స్త్రీ గౌరవానికి రక్షణ గౌరవ మర్యాదలన్నది మానవుల అమూల్యనిధులు. అందుకని ఈ విషయంలోనూ ఇస్లాం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్త్రీలను అగౌరవపరచడం, వారి సౌశీల్యంపై అనుమానాలు రేకెత్తించడం లాంటి దుర్మార్గాన్ని తీవ్రంగా పరిగణించి, దానికి తగిన శిక్షను నిర్ణయించింది. విడాకుల స్వేచ్ఛ అన్ని ప్రయత్నాలూ విఫలమై, దాంపత్య బంధం ఇకముందుకు సాగే పరిస్థితి లేనపుడు పురుషులకు విడాకులిచ్చే అధికారం ఎలా ఉంటుందో, అలాగే మహిళలకూ ‘ఖులా’ ద్వారా భర్త నుంచి విడాకులు పొందే హక్కు ఉంటుంది. అవసరమైతే ఇస్లామీయ న్యాయస్థానం ద్వారా విడాకులు పొందే హక్కు, అధికారాలు మహిళలకు ప్రసాదించబడ్డాయి. విద్యాహక్కు ఇస్లాం ధర్మం స్త్రీ పురుషులిద్దరినీ విద్యను అర్జించమని ఆదేశించింది. కొన్ని సందర్భాల్లో స్త్రీ విద్య అత్యవసరమని నొక్కి చెప్పింది. ఇస్లాం ప్రసాదించిన విద్యా హక్కు కారణంగా ఎంతో మంది ముస్లిం మహిళలు గొప్ప గొప్ప పండితులుగా ప్రసిద్ధిగాంచారు. హజ్రత్ ఆయిషా సిద్ధిఖీ (ర.అన్హా) దీనికి నిదర్శనం.ముఖ్యంగా చూస్తే అదీ ఇదీ అని కాకుండా ఇస్లాం స్త్రీ జాతికి అన్ని రంగాల్లో సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ‘అమ్మ’ గా ఆమె స్థానాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. చెల్లిగా, ఇల్లాలిగా, అత్తగా, కోడలిగా, కూతురిగా వివిధ రంగాల్లో ఆమెకు గౌరవాన్ని, ఆ రంగాల్లో వారిపట్ల ప్రేమను ప్రసాదించింది. తల్లి పాదాల చెంత స్వర్గమున్నదని ప్రకటించి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత ఇస్లాం ధర్మానికి దక్కుతుందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. – ఎండీ ఉస్మాన్‌ఖాన్ -
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్
కడప కల్చరల్ :అద్భుతమైన ఈ సృష్టిని నియంత్రించే శక్తి ఒకటి ఉందని, ఆ శక్తినే అల్లాహ్ (దైవం) అని, ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసేందుకు వెనుకాడకూడదన్న సందేశాన్నిచ్చే పండుగ బక్రీద్. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతిని, సహనశీలత, రుజు వర్తనలను తెలుపుతుంది. మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి దైవం పక్షాన ప్రభవించిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఐదు వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన దేవుడే సకల చరాచర సృష్టికి కారకుడని, ఆయన పట్ల భక్తి ప్రకటించడం ద్వారా ముక్తిని పొందవచ్చునని జాతికి పిలుపునిచ్చారు. ఇస్లాంలో రంజాన్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో, బక్రీద్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మంగళవారం ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాటు సిద్ధం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని ప్రతి వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు ఇస్తారు. మరో భాగాన్ని తమ కోసం వాడుకుంటారు. త్యాగనిరతికి ప్రతీక: ప్రవక్త ఇబ్రహీంకు దైవం మరొక కఠిన పరీక్ష పెట్టారు. కలలో అందిన సూచన మేరకు కుమారుడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతారు. కుమారుడు కూడా దైవాజ్ఞను శిరసావహించేందుకు అంగీకరిస్తాడు. తండ్రి ఇబ్రహీం కుమారుడిని ‘జుబాహ్’ చేశాడు. తీరా చూస్తే కుమారుడికి బదులు అక్కడ ఒక గొర్రెపోతు జుబాహ్ చేయబడి ఉంటుంది. దైవం పట్ల ప్రవక్త ఇబ్రహీంకు గల ఆచంచల భక్తి, విశ్వాసాలకు, త్యాగనిరతికి ప్రతీకగా ముస్లింలు యేటా ‘ ఈద్–ఉల్– జుహా ’ పండుగను నిర్వహించుకుంటున్నారు. ఖుర్బానీ జంతువుల రక్త మాంసాలు అల్లాహ్‌కు చేరవు. కేవలం మీ భయభక్తులే చేరుతాయి – (దివ్య ఖురాన్‌లోని సందేశం) నగరంలో.. బక్రీద్ పండుగ సందర్బంగా నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం కడప నగరంలో మసీదులు, ఈద్గాలలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర శివార్లలోని బిల్టప్, దండు ఈద్గాలు, చాంద్ ఫిరా గుంబద్తోపాటు దాదాపు అన్ని మసీదులు, ఈద్గాలలో ప్రార్థనల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. -
ప్రేమ.. క్షమ.. దాతృత్వం
►పవిత్ర ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త పేర్కొన్నది ఇవే.. ►నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం మతం ఏదైనా చెప్పే నీతి ఒక్కటే. మనిషిగా పుట్టినవారు సన్మార్గంలో నడవాలని. ముస్లింల పవిత్ర ఖురాన్లో మహ్మద్ ప్రవక్త దీన్నే ప్రస్తావించారు. రుజు మార్గాలను చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఖురాన్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించింది. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్. ఈ నెలలో ముస్లింలు ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారంతో ఉంటారు.శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లింలు ఉపవాసాలకు సిద్ధమవుతున్నారు. - కనిగిరి రోజా(ఉపవాస దీక్ష) సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహార పానీయాలు ముట్టకుండా(కఠోర దీక్ష) ఉపవాసాన్ని పాటిస్తారు. లాలాజలంకూడా మింగరు. అత్యంత నిష్టతో ఉపవాసాన్ని(రోజా) ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సహార్ అని, సూర్యాస్తమయం తర్వత ఇఫ్తార్ అని పిలుస్తారు. రోజా ఉండేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఏదైనా ఫలాహారం తీసుకుంటారు. రోజుకు కనీసం 13 గంటలపాటు ఉమ్మి కూడా మింగకుండా కఠోర దీక్ష చేస్తారు. రోజా పాటించేవారు మనసును భగవంతునిపై లగ్నంచేసి చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మసీదుల్లో, దైవ ధ్యానంలో గడుపుతారు. తద్వారా భగవంతునిపై భక్తి, విశ్వాసం, భగవంతుని దృష్టిలో అందరూ సమానం అనే భావన పెంపొందుతుంది. పేద, ధనిక, స్త్రీ, పురుష అనే తారతమ్యం లేకుండా ముస్లింలంతా రోజాను ఆచరిస్తారు. అంతేగాక రంజాన్ నెలలో మరికొన్ని ముఖ్య నియమాలను కూడా ముస్లింలు నిబద్ధతతో పాటిస్తారు. జకాత్ ముస్లింలలో మరీ ముఖ్యమైన సంప్రదాయం జకాత్. ప్రతి వ్యక్తి తన లాభార్జనలో కొంత మేర నిరుపేదలకు దాన, ధర్మాలు చేయడాన్ని జకాత్‌గా పిలుస్తారు. ప్రతి మనిషి తనలాగే ఉన్నతుడు కావాలని కోరుకోవడం ఈ జకాత్ ప్రధాన ఉద్దేశం. జకాత్ నిధితో నిరుపేదలకు వస్తువుల రూపంలో గానీ, నగదు రూపంలో గానీ దానం చేస్తారు. అయితే దానస్వీకర్తల పేర్లను గోప్యంగా ఉంచడమే దీని ప్రధాన నియమం. రంజాన్ నెలలోనే జకాత్ ఇస్తారు. ఫిత్ర్ రంజాన్ మాసం చివరి రోజున జరుపుకునే పర్వదినం ఈద్-ఉల్-ఫిత్.్ర దేవుని అనుగ్రహం కోసం, కృతజ్ఞతగా నిరుపేదలకు ఫిత్(్రదానం) ఇస్తారు. ప్రతిఒక్కరూ కనీసం రెండు కిలోల గోదుమలు లేదా దానికి సమాన మైన ఇతర ఆహార ధాన్యాలు లేదా నగదు దానం చేస్తారు. రంజాన్‌ను ప్రతి ముస్లిం లోటు లేకుండా సంతోషంగా జరుపుకునేందుకు చేయాల్సిన దాన, ధర్మాలను ఇస్లాం మతం ఉద్బోధిస్తుంది. ఎహ్ తే కాఫ్ ముస్లిం సోదరులు రోజూ ఐదుసార్లు నమాజ్(ఉదయం ఫజర్, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం 5 గంటలకు అసర్, రాత్రి 6.30 గంటలకు మగ్రీబ్, రాత్రి 8 గంటలకు ఇషా నమాజ్) చేస్తారు. అయితే రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత, ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్లు తరావీహ్ నమాజ్ చేస్తారు. ఈ నెలలో 21వ రోజు నుంచి నెల చివరి వరకు ఎ్హ తే కాఫ్(తపోనిష్ట) పాటిస్తారు. మసీద్‌లోనే పూర్తి సమయాన్ని గడపుతూ.. ప్రార్థనల్లో దివ్య ఖురాన్(దైవ గ్రంథాలు) చదువుతూ ఉపవాస దీక్షలో నిమగ్నమవుతారు. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే మసీద్ నుంచి బయటకు అడుగుపెడతారు. షబ్ ఎ ఖద్ రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు షబ్ ఎ ఖద్.్ర ఈ నెలలో 27వ రోజున దివ్వ ఖురాన్ ఆవిర్భవించిందని ప్రతీతి. ఆ రోజును షబ్ ఎ ఖదర్‌గా పిలుస్తారు. షబ్ ఎ ఖద్ ్రరాత్రంతా నమాజ్‌తో జాగారం చేస్తారు. ఈ ఒక్కరాత్రి కఠోర దీక్షతో చేసిన ప్రార్థన వల్ల లభించే ఫలితం మనిషి జీవితంలో 83 ఏళ్లపాటు చేసిన ఉపవాస దీక్షతో సమానమని, షబ్ ఎ ఖద్ ్రరోజున దైవ ద్యానంలో గడిపితే జీవితంలో తెలియక చేసిన తప్పులను భగవంతుడు క్షమిస్తాడనేది ముస్లింల నమ్మకం. ఇఫ్తార్ ప్రత్యేకత రంజాన్ మాసంలో ముస్లీంసోదరులు ఉపవాసదీక్షను విరమింప చేసే కార్యక్రమాన్నే ఇఫ్తార్ అంటారు. ఈ ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆహారాన్ని దీక్ష వాసులకు అందించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇఫ్తార్ విందును.. ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రోజా ఆచరించిన వారికి ఇస్తుంటారు.