కల్హేర్(నారాయణఖేడ్) సిద్ధిపేట : నెలవంక తొంగిచూసింది.. సమతా మమతలకు స్ఫూర్తినిచ్చే రంజాన్ ముబారక్ మాసం వచ్చేసింది. ముస్లిం లోగిళ్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఇస్లాం మతం ఆశయాలు, ఆదర్శాలను నూటికి నూరుపాళ్లు ఆచరించే మాసం రంజాన్. గ్రామాలు, పట్టణాల్లో సందడి నెలకొంది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ ముబారక్ మాసం ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల పూర్తికాగానే కనిపించే నెలవంక దర్శనంతో వస్తుంది. దీంతో ముస్లింలు ‘తరావీ’ నమాజ్‌ను ఆచరించి రోజా (ఉపవాస దీక్షలు) ప్రారంభిస్తారు. రాత్రి ‘ఇషా’ నమాజ్ అనంతరం సామూహికంగా తరావీ నమాజ్ చేస్తారు.
తరావీ నమాజ్‌లో పవిత్ర ‘ఖురాన్’ శ్లోకాలను పఠిస్తారు. రంజాన్ నెల ప్రారంభంలోని మొదటి భాగం కారుణ్య భరితమని, మధ్యభాగం దైవ మన్నింపు లభిస్తుందని, చివరిభాగం నరకం నుంచి విముక్తి కలిగి సౌఫల్యం ఖురాన్‌లో పేర్కొన్నట్లు ముస్లిం మతపెద్దలు చెబుతారు. రంజాన్ నెలలో 29 లేదా 30 రోజులపాటు ముస్లింలు వేకువజామునే ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. వేకువజామున ‘ఫజర్’ నమాజ్‌కు ముందు తీసుకునే ఆహారాన్ని ‘సహర్’ అంటారు.
సాయంత్ర సూర్యాస్తమయం వేళ ‘మగ్‌రీబ్’ నమాజ్‌కు ముందు ఉపవాస దీక్ష ముగిస్తారు. దీక్ష విరమణ కోసం ‘ఇఫ్తార్’ చేస్తారు. ఉపవాస దీక్షలతోపాటు క్రమం తప్పకుండా ఐదు పూటలు నమాజ్, ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేస్తారు. షవ్వాల్ నెల చంద్రున్ని చూసి మరుసటి రోజు యావత్తు ముస్లింలు ‘ఈద్ ఉల్ ఫితర్’.. నమాజ్ ఆచరించి చేసుకునే పండుగే రంజాన్. పవిత్ర గ్రంథం ‘ఖురాన్’ రంజాన్ నెలలోనే అవతరించింది. రంజాన్ మాసం ముస్లింలకు ఒక నైతిక శిక్షణలాంటిదని, ఉపవాస దీక్షలతోపాటు ఐదువేళల్లో నమాజ్ చేయడం వల్ల క్రమశిక్షణ, తల్లిదండ్రులు, పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా, పిల్లల పట్ల ప్రేమాభిమానాలతో మెలగడం తెలుస్తుందని ముస్లింలు పేర్కొంటున్నారు.
ఇస్లాం పయనం ఇలా..
ఇస్లాం మతం ఐదు ముఖ్య మూలస్తంభాలపై ప యనిస్తుంది. అందులో మొదటిది ‘కల్మా’ (దేవున్ని విశ్వసించడం), రెండోది ప్రతిరోజు ఐదువేళల్లో నమాజ్ ఆచరించడం, మూడోది రంజాన్ మా సంలో ఉపవాస దీక్షలు పాటించడం, నాలుగోది ‘జకాత్’ రూపంలో పేదలకు దానధర్మాలు చేయడం, ఐదోది ‘హజ్’ (మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం) యాత్ర చేయడం. ఈ ప్రధాన ఐదు సూత్రాలను ముస్లింలు పాటిస్తారు. రంజాన్ నెల లో పాటించే పద్ధతులు విజయవంతమైన జీవనానికి భరోసా ఇస్తాయి. ఉపవాస దీక్షల్లో ఉంటూ ఐదు వేళల్లో నమాజ్ చేస్తే మనోధైర్య, సహనం, ఆత్మస్థైర్యం, ధాతృత్వం పెంపొందుతుంది.
ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ ‘సర్దార్’..
రంజాన్ మాసంలో నమాజ్ చదువుతూ భగవంతున్ని స్మరించుకుంటారు. పవిత్ర గ్రంథం ఖురాన్ పఠిస్తూ దేవుని స్మరణలో లీనమైపోతారు. ఇస్లామిక్ మాసాల్లో అన్నింటికంటే రంజాన్ నెల చాలా గొప్పది. భగవంతుడు అన్ని మాసాల్లో రంజాన్ మాసాన్ని సర్దార్ చేసినట్లు ముస్లిం మత పెద్దలు చెపుతున్నారు. రంజాన్ మాసం చాలా బర్కత్ ఇస్తుంది. పవిత్ర గ్రంథం ఖురాన్ రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది.
ప్రవక్త ‘హుజూర్‌పాక్ సల్లెల్లాహు అలైహి వసల్లాం’ రంజాన్ నెలలో ‘అల్లాహ్’కి బందెగి కర్నె కేలియే బహుత్ జ్యాదా తాకిర్ కరే.. అని ముస్లింలు భావిస్తున్నారు. రంజాన్ నెల 27న రాత్రి ‘షబ్ ఏ ఖదర్’ జరుపుకుంటారు. రాత్రి (ఇబాదత్) జాగరణ చేస్తూ భగవంతుడిని తలుచుకుంటారు. షబ్ ఏ ఖదర్ రోజు ఇబాదత్ చేస్తే వెయ్యి మాసాల ‘సవాబ్’ (దేవుడి ఆశీస్సులు) దొరుకుతుంది.
సహర్‌తో రోజా ప్రారంభం..
రంజాన్ మాసంలో తెల్లవారు జామునలో ఫజర్ నమాజ్‌కు ముందు రోజా ఉండేందుకు ముస్లింలు ‘సహర్’ చేస్తారు. సహర్‌కు ముందు ఆహారం తీసుకుంటారు. అనంతరం ఉపవాస దీక్ష కఠిన ంగా పాటిస్తారు. కనీసం మంచి నీరు కూడా తీసుకోరు. రోజా ముగింపు సందర్భంగా సాయంత్రం ‘ఇఫ్తార్’తో దీక్షను విరమిస్తారు. ఇఫ్తార్‌లో పండ్లు, ఇతర తీపి పదార్థాలు తీసుకుంటారు. లేకుంటే కనీసం ఒక ఖజ్జూర పండు, కొంచెం నీరు తాగి ఇఫ్తార్ చేస్తారు.
తరావి నమాజ్..
రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తరావి నమాజ్ చ దువుతారు. ఫజర్, జోహర్, అసర్, మగ్‌రీబ్, ఇ షా నమాజులతో పాటు ప్రత్యేకంగా తరావి న మాజ్ చే యడం రంజాన్ మాసంలో ప్రత్యేకత. రంజాన్ ఆ రంభం కోసం నెల వంక దర్శనం అన ంతరం ఇషా నమాజ్ అనంతరం తరావి నమాజ్ చేస్తారు. తరా వి నమాజ్ సున్నాత్‌గా భావిస్తారు. 20 రకాత్‌లు తరావి నమాజ్ చదువుతారు.
పవిత్ర గ్రంథం ఖురాన్..
మానవ జీవితం ఎలా ఉండాలో మార్గదర్శకాలను సూచించే ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్. రంజాన్ మాసంలో ‘లైలతుల్ ఖద్ర్’ (పవిత్రమైన రాత్రి) నాడు అరబ్బీ భాషలో ఖురాన్ గ్రంథం అవతరించింది. ఖురాన్‌లో 30 ‘పారాలు’ (భాగాలు) ఉన్నాయి. 114 సూరాలతో పాటు 14 సజ్ధాలు వస్తాయి. ఖురాన్ ఎంతో పవిత్రమైంది. ఖురాన్‌ను ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. ప్రత్యేకించి ‘రెహల్’ (చెక్కతో తయారు చేసిన) ఉపయోగించి ఖురాన్ పఠనం చేస్తారు. ఖురాన్‌ను విశ్వసించి జీవితంలో దాన్ని అమలు చేయాలి. జీవితానికి సంబంధించిన దైవాజ్ఞలను తెలుసుకొనేందుకు ప్రతీ రోజు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తూ అవగాహన చేసుకోవాలి.
రంజాన్ దీక్షలు కఠినం
రంజాన్ మాసంలో రోజా చేపట్టేందుకు అత్యంత కఠినంగా వ్యవహరించాలి. రంజాన్ ముబారక్ నెల చాలా గొప్పది. రోజా ఉండడం, నమాజ్, ఖురాన్ చదవడం ప్రత్యేకత. ఉపవాస దీక్షలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేపట్టాం. సహర్ కోసం నిద్ర నుంచి లేపేందుకు సైరన్ ఏర్పాటు చేశాం. – ఎండి. ఖుద్బొద్దీన్, మసీద్ కమిటీ అధ్యక్షుడు, కల్హేర్
నియమాలు పాటించాలి
రంజాన్ నెలలో అన్ని నియమాలు పాటించాలి. ‘ఇమాన్‌వాలో ఇస్ మహినేకో జాన్‌కర్ రోజా రఖో’ తరావి నమాజ్, ఖురాన్ చదివితే పూరే గుణా (పాపాలు) అల్లాహ్‌తాలా మాఫీ కరేగా’ రంజాన్ నెలలో అల్లాహ్ ఇబాదత్ కర్నా చాహియే. – మౌలనా లతీఫ్, ఇమాం, కల్హేర్
Comments
Please login to add a commentAdd a comment