నేడు (సోమవారం) బక్రీద్ సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెల్లవారుజాము నుంచే ముస్లింలు ప్రార్థనల కోసం మసీదుకు తరలివచ్చారు. దీంతో జామా మసీదు చుట్టుపక్కల ప్రాంతాలు, మార్కెట్లలో సందడి నెలకొంది.
ఈద్ ఉల్ అజా పండుగను బుధవారం సాయంత్రం వరకు ముస్లింలు జరుపుకోనుండటంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. జామా మసీదులో ఈరోజు ఉదయం 6 గంటలకు, ఫతేపురి మసీదులో ఉదయం 7.15 గంటలకు ఈద్-ఉల్-అజా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫతేపురి మసీదు షాహీ ఇమామ్ డాక్టర్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను సమైక్యంగా జరుపుకోవాలన్నారు.
#WATCH | Delhi: Devotees offer Namaz at the Jama Masjid on the occasion of Eid Al Adha festival. pic.twitter.com/OnufmNVisx
— ANI (@ANI) June 17, 2024
పండుగలనేవి ఆనందంగా చేసుకునేందుకేనని, ఈరోజు ఎవరినైనా బాధపెడితే పండుగ అర్థరహితమన్నారు. జంతువుల బలి విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈద్ ఉల్ అజా సందర్భంగా పాత ఢిల్లీలోని మార్కెట్లలో సందడి నెలకొంది. రాత్రంతా ఇది కొనసాగింది. ఢిల్లీలోని దర్గా పంజా షరీఫ్‌లో ఈద్-ఉల్-అజా సందర్భంగా బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నమాజ్ చేశారు.
#WATCH | Delhi: BJP Leader Mukhtar Abbas Naqvi offers Namaz at Dargah Panja Sharif on the occasion of Eid Al Adha pic.twitter.com/bVcNW9Ec6K
— ANI (@ANI) June 17, 2024
Comments
Please login to add a commentAdd a comment