బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఆదేశాలు
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది.
దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్‌లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment