Azaan
-
నమాజ్ వేళ దుర్గా పూజ మైకులు ఆపండి
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్‌లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. -
ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అజాన్ (ముస్లింల ప్రార్ధనా సమయానికి ముందు ఇచ్చే పిలుపు) ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మసీదులా కనిపిస్తున్న ఓ ప్రదేశంలో జన సమూహం ముందు అన్వర్ భారత ప్రధానిపై అవాక్కులు చవాక్కులు పేలాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ అన్‌టోల్డ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా, వైరలవుతోంది. "It doesn't matter how many times you stop your speech for Azan You will remain a Satan-possessed Hindu." BTW this Mullah is ex Pak cricket captain Saeed Anwar who Indian Hindus hosted countless times. Imagine the hate in commoners. pic.twitter.com/tRhdSQ2HJL — Pakistan Untold (@pakistan_untold) March 5, 2023 అన్వర్ మోదీపై దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత నెటిజన్లు సయీద్ అన్వర్‌పై విరుచుకుపడుతున్నారు. అన్వర్ క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో అభిమానించారని.. శత్రు దేశానికి చెందిన వాడని కూడా చూడకుండా, అతని ఆటను ఆస్వాదించారని.. భారత ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అన్వర్ తన వక్రబుద్ధిని చాటుకున్నాడని మండిపడుతున్నారు. సైతాన్ ఆవహించింది మోదీకి కాదని, మతం మత్తులో విధ్వేషాలను రెచ్చగొడుతున్న అన్వర్‌కేనని ధ్వజమెత్తుతున్నారు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఓ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రసంగిస్తుండగా సమీపంలో ఉన్న ఓ మసీదులో అజాన్ ఇచ్చారు. అప్పుడు మోదీ ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ.. కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి వేశారు. మోదీ ఇలా చేయడాన్ని ఉద్దేశిస్తూనే సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 1989లో అంతర్జాతీయ క్రికెట్లోని అడుగుపెట్టిన అన్వర్.. 2003లో ఆటకు వీడ్కోలు పలికాక ఇస్లాం ప్రచారకర్తగా మారిపోయాడు. అన్వర్ 2001-02లో ముల్తాన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతుండగా.. అతని కుమార్తె బిస్మా అన్వర్ ఆనారోగ్యం కారణంగా కన్నుమూసింది. మ్యాచ్ జరుగుతుండగానే అన్వర్‌కు ఈ విషయం తెలిసింది. ఆ మ్యాచ్‌లో అన్వర్ సెంచరీ చేశాడు. ఈ విషయం పాకిస్తాన్ అభిమానులతో పాటు భారత అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేసింది. పాక్ అభిమానులతో పోలిస్తే భారత అభిమానులు అన్వర్‌కు అధిక శాతం అండగా నిలిచారు. అతని చిన్నారి కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు కూడా చేశారు. -
మసీదులో ఏమైనా జరుగుతోందా? అమిత్ షా చర్యతో అంతా చప్పట్లు
బారాముల్లా(జమ్ము కశ్మీర్): కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన చేష్టలతో కశ్మీరీల జేజేలు అందుకున్నారు. బుధవారం సాయంత్రం ఉత్తర కశ్మీర్ బారాముల్లాలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అయితే.. కాసేపటికే ఆయనకు ఏదో శబ్దం వినిపించింది. మసీదులో ఏమైనా జరుగుతుందా? అని ఆయన పక్కనున్న నేతలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని మసీదు నుంచి అజాన్ అని వాళ్లు చెప్పగానే.. ఆయన తన ప్రసంగాన్ని ఆపేశారు. కాసేపటి తర్వాత అయిపోయిందా? అజాన్ అయిపోయింది ఇప్పుడు నేను ప్రసగించొచ్చా..? అంటూ అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు, ఈలలతో ఆయన్ని అభినందించారు. Halting the Speech Midway by Hnbl Home Minister due to #Azaan is Great Gesture and has Won the Hearts of Kashmiris, this Clearly Indicates the Respect for the Religion and Sentiments of Kashmiris. @AmitShah @AshokKoul59 #NayaKashmir pic.twitter.com/853g8IXXgq — Sheikh Iqbal (@ListenIqbal) October 5, 2022 అంతకు ముందు ర్యాలీలో ప్రసంగించే ముందు అమిత్ షా బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ను తొలగించారు. తాను ప్రజలతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను అంటూ ప్రసంగించడం గమనార్హం. ఇక ర్యాలీ తర్వాత వురికి వెళ్లిన ఆయన.. అక్కడ మే నెలల జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పోలీస్ అధికారి ముదాసిర్ షేక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన సమాధికి నివాళులర్పించారు. కేంద్రం నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మాటిచ్చారాయన. VIDEO: Just before addressing the gathering in #Baramulla, J&K today, Home Minister @AmitShah ji had his bullet proof glass removed. pic.twitter.com/gSMM4uMtMi — Dr Jitendra Singh (@DrJitendraSingh) October 5, 2022 ఇదిలా ఉంటే.. హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన బుధవారంతో ముగిసింది. కశ్మీర్ భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు ఆయన. ఇక ఈ పర్యటనలోనే ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే పాక్‌తో ఎట్టిపరిస్థితుల్లో చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. -
రంజాన్ నెల.. ‘ఆజాన్’పై నిషేధం లేదు..
న్యూఢిల్లీ : పవిత్ర రంజాన్ నెలలో నగరంలోని మసీదుల్లో ‘ఆజాన్’ ఇవ్వటంపై నిషేధం ఉందని వస్తున్న వార్తలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొట్టిపరేశారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. మసీదుల్లో ‘ఆజాన్’పై ఎటువంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. మసీదుల వద్ద నమాజు చేయటానికి జనాలు గుమిగూడటంపై పూర్తిస్థాయి నిషేధం ఉందని తెలిపారు. అంతకు క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ తన ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ ఢిల్లీ మసీదుల్లో ఆజాన్ ఇవ్వకుండా చూసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ పోలీసులను ఆదేశించారా?.. నేను ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడతాన’’ని ట్వీట్ చేశారు. ( మాస్క్ ధరించిన ఉల్కపాతం! ) क्या LG साहब ने दिल्ली पुलिस को ये ऑर्डर दिया है कि रमज़ान में दिल्ली की मस्जिदों में अज़ान नही होगी, इस मुद्दे पर मेरी दिल्ली पुलिस कमिशनर से बात हुई वो इस मुद्दे को देख रहे हैं , मेरी LG साहब से ये दरखुवास्त है दिल्ली को और घाव न दें, हम सब एक साथ मिलकर रहना चाहते हैं। pic.twitter.com/Y6fL1uqwRY — Amanatullah Khan AAP (@KhanAmanatullah) April 24, 2020 ఆ వీడియోలో.. వీధుల్లో నించుని ఉన్న పోలీసులు ఢిల్లీ మసీదుల్లో ఆజాన్ ఇవ్వటంపై నిషేదం ఉందని అక్కడి వారికి చెబుతారు. దీనిపై స్పందించిన ఓ మహిళ .. ఆజాన్ లేకపోతే రంజాన్ నెలలో జరుపుకునే ఉపవాసం దీక్షను ఎలా విరమిస్తామని ప్రశ్నిస్తుంది. దీనికి పోలీసులు జవాబిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రశ్నించమని అంటారు. అయితే అమానుతుల్లా ఖాన్ విడుదల చేసిన ఈ వీడియో ఢిల్లీలోని ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందన్నది తెలియరాలేదు. -
భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!
ఇస్లామాబాద్: భారత్‌లో కొన్నాళ్లు పెరిగినప్పటికీ పాకిస్తాన్‌ను మాత్రమే తన సొంతిళ్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడతానని ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ కుమారుడు అజాన్ సమీ పేర్కొన్నాడు. తన తండ్రి భారత పౌరసత్వం తీసుకున్నప్పటికీ తానెప్పటికీ పాక్ పౌరుడిగానే ఉంటానని తెలిపాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజాన్ మాట్లాడుతూ...‘ మా నాన్న అంటే నాకు ఇష్టంతో పాటు గౌరవం కూడా ఉంది. తను ఏ దేశంలో నివసించాలనుకుంటున్నానో నాన్న చెప్పినపుడు..ఆయన నిర్ణయాన్ని గౌరవించాను. అంతేతప్ప వ్యతిరేకంగా మాట్లాడలేదు. భారత్‌లో ఉండాలని ఆయన అనుకున్నారు. నేను పాకిస్తాన్‌ను ఎంచుకున్నాను. నిజానికి నా టీనేజ్‌లో చాలా ఏళ్లు ఇండియాలోనే పెరిగాను. అక్కడ నాకు అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. అయినప్పటికీ పాక్‌నే నా సొంత ఇంటిలా భావిస్తాను. అక్కడి ఇండస్ట్రీ నాకు కుటుంబం లాంటిది. పాక్ ఇండస్ట్రీలో భాగమైనందుకు గర్వపడుతున్నా’ అని ఈ మ్యూజిక్ కంపోజర్ చెప్పుకొచ్చాడు. ఇక తన తండ్రితో అనుబంధం గురించి చెబుతూ...‘ఒక్కోసారి నెలల పాటు నాన్నను చూసే అవకాశం ఉండేది కాదు. అయినా తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలు చెప్పకూడదు కదా. అమ్మానాన్నా విడిపోయిన తర్వాత నేను అమ్మ దగ్గరే పెరిగాను. నాన్నతో స్నేహితుడిలా మెలిగేవాడిని. ప్రస్తుతం మేమిద్దరం ఎన్నో విషయాల గురించి చర్చిస్తాం. కెరీర్‌కు సంబంధించి ఆయన సలహాలు, సూచనలు ఇస్తారు. నా దృష్టిలో ఆయనో మ్యూజిక్ లెజెండ్. నా పాటలకు మొదటి విమర్శకుడు ఆయనే. తన ప్రభావం నా మీద పడకుండా సొంత శైలి అలవరచుకోమని ప్రోత్సహిస్తారు’ అని అజాన్ పేర్కొన్నాడు. కాగా అజాజ్.. అద్నాన్ సమీ- పాక్ నటి జేబా భక్తీర్‌ల సంతానం. ఇక పాకిస్తాన్లో పుట్టిన అద్నాన్ భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే నివసిస్తున్న సంగతి తెలిసిందే. -
అజాన్‌తో శబ్ద కాలుష్యం
అగర్తలా: త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన సమయంలో.. ఆయన హిందువులు శవ దహనం వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుంది.. వాటిని ఆపేయమంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలనే ఆయన చేశారు. ముస్లింలు ఉదయాన్నే లౌడ్ స్పీకర్ల నుంచి అజాన్ చేయడం వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతోందంటూ ట్వీట్ చేశారు. దీపావళి పండుగ వచ్చిన ప్రతిసారి బాణాసంచా వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యంకు వ్యతిరేకంగా అందరూ పోరాడుతున్నారు. అదే విధంగా ప్రతిరోజూ ముస్లింలు ఉదయాన్నే 4.30 గంటలకు లౌడ్ స్పీకర్లలో అజాన్ చేయడం వల్ల కూడా కాలుష్యం వెలువడుతోంది.. దానిపై లౌకికవాదులు ఎందుకు స్పందించడం లేదని ట్వీట్లో ప్రశ్నించారు. లౌడ్ స్పీకర్లలోనే అజాన్ పిలుపు ఇవ్వాలని ఖురాన్, హదీసుల్లో ఎక్కడా లేదని.. తథాగత్ రాయ్ అన్నారు. -
'ఏం మనుషులు.. ఆ నటికి నిద్రే ముఖ్యమేమో'
లక్నో: తెల్లవారు జామున 5గంటలకే ఆజాన్ ఇచ్చి నిద్రభంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించిన గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తికి సమాజ్‌వాది పార్టీకి చెందిన ఓ నేత కౌంటర్ ఇచ్చారు. దేవుడి ప్రార్థనకంటే ఆమెకు నిద్రే ముఖ్యమైనట్లుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు గతంలో నుంచి వస్తున్నాయి. వీళ్లంతా అసలు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. ఆమెను చూసి నాకు బాధగా ఉంది.. బహుశా ఆమెకు నిద్రనే బాగా ముఖ్యమైనట్లుంది' అని ఎస్పీ నేత జుహీ సింగ్ అన్నారు. నిన్న(ఆదివారం) ఆజాన్ వల్ల తనకు నిద్రాభంగం కలిగిందని, అయినా, దేవుడిని ప్రార్థించాలని ఇతరులకు ఇబ్బంది కలిగేలా తెల్లవారు జామున్నే మైకుల ద్వారా చెప్పడం దేనికంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను బ్రహ్మముహూర్తంలోనే మేల్కొంటానని, పూజలు చేస్తానని, యోగాలాంటివి చేస్తానని, తన దేవుడిని గుర్తు చేసుకునేందుకు ప్రత్యేక లౌడ్ స్పీకర్స్ అవసరం లేదంటూ కూడా ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆమెపై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.