అగర్తలా: త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన సమయంలో.. ఆయన హిందువులు శవ దహనం వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుంది.. వాటిని ఆపేయమంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలనే ఆయన చేశారు.
ముస్లింలు ఉదయాన్నే లౌడ్ స్పీకర్ల నుంచి అజాన్ చేయడం వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతోందంటూ ట్వీట్ చేశారు. దీపావళి పండుగ వచ్చిన ప్రతిసారి బాణాసంచా వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యంకు వ్యతిరేకంగా అందరూ పోరాడుతున్నారు. అదే విధంగా ప్రతిరోజూ ముస్లింలు ఉదయాన్నే 4.30 గంటలకు లౌడ్ స్పీకర్లలో అజాన్ చేయడం వల్ల కూడా కాలుష్యం వెలువడుతోంది.. దానిపై లౌకికవాదులు ఎందుకు స్పందించడం లేదని ట్వీట్‌లో ప్రశ్నించారు. లౌడ్ స్పీకర్లలోనే అజాన్ పిలుపు ఇవ్వాలని ఖురాన్, హదీసుల్లో ఎక్కడా లేదని.. తథాగత్ రాయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment