Tathagata Roy
-
నచ్చని వాళ్లు ఉత్తర కొరియాకు వెళ్లిపోవచ్చు
షిల్లాంగ్ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ శుక్రవారం వివాదాస్పద ట్వీట్ చేశారు. అలాంటి వారు నార్త్ కొరియాకు వెళ్లిపోవచ్చని సూచించారు. పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. రెండు వాస్తవ విషయాలను వివాదాస్పదంగా ఎప్పుడూ చూడకూడదు. 1. దేశ విభజన మతం కారణంగా జరిగింది. 2. విభజిత ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరం. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరంగా ఉత్తర కొరియాకు వెళ్లొచ్చు అని ట్వీట్ చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన నిరసనకారులు రాజభవన్ను ముట్టడించడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలను దాటి లోపలికి ప్రవేశించాలని యత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ జరిపారు. అనంతరం టియర్ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులతో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. Two things should never be lost sight of in the present atmosphere of controversy. 1. The country was once divided in the name of religion. 2. A democracy is NECESSARILY DIVISIVE. If you don’t want it go to North Korea. — Tathagata Roy (@tathagata2) December 13, 2019 -
కశ్మీర్‌పై గవర్నర్ వివాదాస్పద ట్వీట్
సాక్షి, శ్రీనగర్ : రెండేళ్ల పాటు దేశ ప్రజలు ఎవరూ కశ్మీర్ వెళ్లొద్దని ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చేసిన ట్వీట్‌ను సమర్ధించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్మీ అధికారి తన ట్వీట్లో ‘రెండేళ్ళ పాటు భారతీయులు ఎవరూ కశ్మీర్ వెళ్ళొద్దు.. అమర్నాథ్కు వెళ్ళొద్దు.. కశ్మీర్ ఎంపోరియం నుంచి కశ్మీరీ వర్తకుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయొద్దు’. అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ రిటైర్డ్ అధికారిని సమర్థిస్తూ తథాగత రాయ్ ట్వీట్ చేశారు. ఇక గవర్నర్ తీరుపై నెటిజన్లతో పాటూ కశ్మీరీ నేతలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉండి ఇలాంటి ట్వీట్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరుల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తథాగత రాయ్‌పై మండిపడ్డారు. ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. తథాగత రాయ్ వంటి వ్యక్తులు కశ్మీరీలు లేని కశ్మీర్ కావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. An appeal from a retired colonel of the Indian Army: Don’t visit Kashmir,don’t go to Amarnath for the next 2 years. Don’t buy articles from Kashmir emporia or Kashmiri tradesman who come every winter. Boycott everything Kashmiri. I am inclined to agree — Tathagata Roy (@tathagata2) February 19, 2019 Deplorable statement coming from the Governor of Meghalaya. GoI must sack him immediately . If they fail to do so, it means he has their tacit approval and are using it as an election ploy to polarise the situation. https://t.co/AQE0e1akUH — Mehbooba Mufti (@MehboobaMufti) February 19, 2019 People like Tathagata want Kashmir but without Kashmiris. They’d sooner see us driven in to the sea. He’ll be best placed to know he can’t have one without the other so what’s it to be? https://t.co/BS1zAG78Xx — Omar Abdullah (@OmarAbdullah) February 19, 2019 -
వాజ్‌పేయి ఇకలేరు.. గవర్నర్ షాకింగ్ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి(93) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్‌లోవెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి.. త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ వివాదస్పద ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఇక లేరంటూ ఆయన చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ట్వీట్ ఎలా చేస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ నిమిషాల్లో వైరల్ గా మారి.. విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన ఆ ట్వీట్‌ను తొలగించి పొరపాటు జరిగిందని క్షమాపణలు కోరారు. -
సర్కార్ కొలువుకి గవర్నర్ సిఫార్సు.. రచ్చ
అగర్తలా: త్రిపుర గవర్నర్ తథాగత రోయ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి బీజేపీ నేత పేరును ఆయన సిఫార్సు చేశారు. బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సర్వదామన్ రాయ్‌కు అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం ఇప్పించాంటూ కోరుతూ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌కు స్వయంగా గవర్నర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖ బయటకు రావటంతో తీవ్ర దుమారం చెలరేగింది. ‘సర్వదామన్తో నేను బీజేపీలో పని చేశా. ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్‌లో నిపుణులు. పలు ప్రముఖ కంపెనీలో పని చేశారు. ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటే మంచిదని భావిస్తున్నా’ అని తథాగత రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ బయటకు పొక్కటంతో అసలు వ్యవహారం మొదలైంది. ప్రతిపక్ష సీపీఎం.. గవర్నర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి ఈ లేఖ గురించి తెలీదని చెబుతుండగా.. సీఎం కార్యాలయం మాత్రం ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించింది. చివరకు తథాగత రోయ్ ట్వీటర్లో స్పందించారు. ‘ఆ లేఖను నేనే రాసింది. ఓ ఉద్యోగం కోసం సత్ప్రవర్తన కింద ఆ లేఖ ఇచ్చాను. ఆ మాత్రం దానికే కొలంబస్ అమెరికాను కనిపెట్టి మీరు భావిస్తున్నారు. అలాగైతే మిమల్ని మీరు వెధవలను చేసుంటూ ముందుకు సాగినట్లే’ అంటూ ఓ ట్వీట్లో ఆయన చురకలంటించారు. ఇక ఈ లేఖపై కథనాలు ప్రసారం చేస్తున్న ఓ న్యూస్ ఛానెల్‌పైనా ఆయన మండిపడ్డారు. కాగా, తథాగత వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఆయన ఓ గవర్నర్ మాదిరి కాకుండా.. బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ సీపీఎం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. Of course I wrote that letter! It isn’t even confidential because it is a normal recommendation for a perfectly bona fide purpose. But,as I said,if you are feeling the way Columbus felt on discovering America,go ahead and make bigger fools of yourselves — Tathagata Roy (@tathagata2) 28 April 2018 -
ప్రభుత్వంలోకి రాకముందే అల్లర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలోనియా పట్టణంలోని రష్యా కమ్యూనిస్టు విప్లవ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం కాషాయ వర్గాల ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాల మధ్య బుల్డోదర్తో కొందరు కూల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో పట్టణంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగడంతో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఖండించింది. ‘చలో పల్టాయియే’ అనే నినాదంతో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేస్తున్న దశ్యాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి, ఆ తర్వాత కొంత సేపటికి తొలగించారు. త్రిపుర ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ‘చలో పల్టాయియే’ అనే నినాదాన్ని ఎక్కువగా ఇచ్చిన విషయం తెల్సిందే. లెనిన్ ఓ విదేశీయుడు, టెర్రరిస్టు లాంటి వాడని, ఆయన విగ్రహాన్ని తొలగిస్తే తప్పేమిటని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ఇక రాష్ట్ర గవర్నర్ తథాగథ రాయ్ మరో అడుగు ముందుకు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం ఓ పని చేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మరో ప్రభుత్వం ఆ పనిని తుడిచేస్తుందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వీరి వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి. బీజేపీ సంఘ్‌పరివార్ లెనిన్ విగ్రహాన్ని విధ్వంసం చేశాయని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఉద్రిక్తతలు ఏర్పడి అవి అల్లర్లకు, హింసాకాండకు దారితీస్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రలను పరిరక్షించాల్సిన ఓ గవర్నరే బాధ్యతార హితంగా హింసను రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా? అప్పుడే సోషల్ మీడియాలో లెనిన్ విగ్రహం విధ్వంసం మీద నిప్పంటుకుంది. సమర్థించే, వ్యతిరేకించే మధ్య రచ్చ జరుగోతోంది. ఇప్పటికే ద్రవిడ ఉద్యమానికి మూలకర్తయిన పెరియార్ రామస్వామి అంటే పడని బీజేపీ మూకలు తమిళనాడులో ఆయన విగ్రహాలను తొలగిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వాటిని కూల్చేందుకు అల్లరి మూకలు ప్రయత్నిస్తే తమిళనాడు భగ్గు మనదా? మెజారిటీ ప్రజల మద్దతు ఉందనుకుని ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడిన 1984 నుంచి 2002 వరకు దేశంలో రక్తపాత సంఘటనలు పునరావతం అవుతాయి. తాజా సంఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి త్రిపుర గవర్నర్ తథాతథ రావుతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎలా మందలించారో తెలియదు. -
అజాన్‌తో శబ్ద కాలుష్యం
అగర్తలా: త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన సమయంలో.. ఆయన హిందువులు శవ దహనం వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుంది.. వాటిని ఆపేయమంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలనే ఆయన చేశారు. ముస్లింలు ఉదయాన్నే లౌడ్ స్పీకర్ల నుంచి అజాన్ చేయడం వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతోందంటూ ట్వీట్ చేశారు. దీపావళి పండుగ వచ్చిన ప్రతిసారి బాణాసంచా వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యంకు వ్యతిరేకంగా అందరూ పోరాడుతున్నారు. అదే విధంగా ప్రతిరోజూ ముస్లింలు ఉదయాన్నే 4.30 గంటలకు లౌడ్ స్పీకర్లలో అజాన్ చేయడం వల్ల కూడా కాలుష్యం వెలువడుతోంది.. దానిపై లౌకికవాదులు ఎందుకు స్పందించడం లేదని ట్వీట్లో ప్రశ్నించారు. లౌడ్ స్పీకర్లలోనే అజాన్ పిలుపు ఇవ్వాలని ఖురాన్, హదీసుల్లో ఎక్కడా లేదని.. తథాగత్ రాయ్ అన్నారు. -
పటాకులపై నిషేధం.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
-
పటాకులపై నిషేధం.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కోల్‌కతా: దేశ రాజధాని ఢిల్లీలో, ఎన్సీఆర్లో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పుబడుతూ త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మొదట ఉట్టి (దహీఅండీ) వేడుకలు, ఇప్పుడు పటాకులు.. రేపు హిందూ దహన సంస్కారాలనూ నిషేధిస్తారేమో.. కొవ్వొత్తులతో నిరసన తెలిపే ఈ అవార్డు వాపసీ గ్యాంగ్ హిందూ దహన సంస్కారాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుందని కోర్టులో పిటిషన్ వేస్తుందేమో' అని తథాగత్ రాయ్ ట్వీట్ చేశారు. అతివాద హిందూత్వ భావజాలాలు ఉన్న ఒకప్పటి బీజేపీ సీనియర్ నేత అయిన తథాగత్ రాయ్ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే, దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలను నిషేధించడం తనను అసంతృప్తికి గురిచేసిందని, హిందువుల పండుగ చేసుకునే హక్కును ఇది దూరం చేస్తుందనే భావనతోనే ఈ వ్యాఖ్య చేసినట్టు ఆయన మీడియాకు చెప్పారు. తథాగత్ రాయ్ గతంలోనూ పలు అంశాలపై తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రోహింగ్యాలను 'చెత్త'తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది. -
త్రిపుర గవర్నర్‌కు అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు
న్యూఢిల్లీ: త్రిపుర గవర్నర్ తథగట రాయ్‌కు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాష్ట్రపతి భవన్ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా అనారోగ్యంతో సెలవుపై ఉన్న కారణంగా తథగట రాయ్‌కు రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అయితే రాజ్కోవా సెలవు కాలాన్ని మాత్రం రాష్ట్రపతి భవన్ తెలుపలేదు. రాజ్కోవా(72) అనారోగ్యంతో మంగళవారం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. -
'అధినాయక్'పై గవర్నర్ VS గవర్నర్
కోల్‌కతా: జాతీయ గీతం జనగణమనలో 'అధినాయక్' అనే పదాన్ని తొలగించాలన్న రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వ్యాఖ్యలపై త్రిపుర గవర్నర్ టతగట రాయ్ విబేధించారు. జాతీయ గీతంలో మార్పులో చేయగాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని, మనకు స్వాతంత్ర్య వచ్చి 67 ఏళ్లు అవుతోందని, అధినాయక్ అన్న పదం బ్రిటీష్‌కు సంబంధించినది ఎందుకు అవుతుందని త్రిపుర గవర్నర్ ట్వీట్ చేశారు. జనగణమనలోని 'అధినాయక్' అంటే బ్రిటీషర్లను కీర్తించడమేనని, ఈ పదాన్ని తొలగించాలని కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీకే చెందిన పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత, ప్రస్తుత త్రిపుర గవర్నర్ విబేధించారు.