సాక్షి, కోల్‌కతా: దేశ రాజధాని ఢిల్లీలో, ఎన్సీఆర్‌లో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పుబడుతూ త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మొదట ఉట్టి (దహీఅండీ) వేడుకలు, ఇప్పుడు పటాకులు.. రేపు హిందూ దహన సంస్కారాలనూ నిషేధిస్తారేమో.. కొవ్వొత్తులతో నిరసన తెలిపే ఈ అవార్డు వాపసీ గ్యాంగ్ హిందూ దహన సంస్కారాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుందని కోర్టులో పిటిషన్ వేస్తుందేమో' అని తథాగత్ రాయ్ ట్వీట్ చేశారు.
అతివాద హిందూత్వ భావజాలాలు ఉన్న ఒకప్పటి బీజేపీ సీనియర్ నేత అయిన తథాగత్ రాయ్ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే, దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలను నిషేధించడం తనను అసంతృప్తికి గురిచేసిందని, హిందువుల పండుగ చేసుకునే హక్కును ఇది దూరం చేస్తుందనే భావనతోనే ఈ వ్యాఖ్య చేసినట్టు ఆయన మీడియాకు చెప్పారు. తథాగత్ రాయ్ గతంలోనూ పలు అంశాలపై తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రోహింగ్యాలను 'చెత్త'తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది.
Comments
Please login to add a commentAdd a comment