దేశ రాజధాని ఢిల్లీలో, ఎన్సీఆర్‌లో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పుబడుతూ త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మొదట ఉట్టి (దహీఅండీ) వేడుకలు, ఇప్పుడు పటాకులు.. రేపు హిందూ దహన సంస్కారాలనూ నిషేధిస్తారేమో.. కొవ్వొత్తులతో నిరసన తెలిపే ఈ అవార్డు వాపసీ గ్యాంగ్ హిందూ దహన సంస్కారాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుందని కోర్టులో పిటిషన్ వేస్తుందేమో' అని తథాగత్ రాయ్ ట్వీట్ చేశారు.