అగర్తలా: త్రిపుర గవర్నర్ తథాగత రోయ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి బీజేపీ నేత పేరును ఆయన సిఫార్సు చేశారు. బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సర్వదామన్ రాయ్‌కు అకౌంట్ సెక్షన్‌లో ఉద్యోగం ఇప్పించాంటూ కోరుతూ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌కు స్వయంగా గవర్నర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖ బయటకు రావటంతో తీవ్ర దుమారం చెలరేగింది.
‘సర్వదామన్‌తో నేను బీజేపీలో పని చేశా. ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్‌లో నిపుణులు. పలు ప్రముఖ కంపెనీలో పని చేశారు. ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటే మంచిదని భావిస్తున్నా’ అని తథాగత రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ బయటకు పొక్కటంతో అసలు వ్యవహారం మొదలైంది. ప్రతిపక్ష సీపీఎం.. గవర్నర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి ఈ లేఖ గురించి తెలీదని చెబుతుండగా.. సీఎం కార్యాలయం మాత్రం ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించింది.
చివరకు తథాగత రోయ్ ట్వీటర్‌లో స్పందించారు. ‘ఆ లేఖను నేనే రాసింది. ఓ ఉద్యోగం కోసం సత్ప్రవర్తన కింద ఆ లేఖ ఇచ్చాను. ఆ మాత్రం దానికే కొలంబస్ అమెరికాను కనిపెట్టి మీరు భావిస్తున్నారు. అలాగైతే మిమల్ని మీరు వెధవలను చేసుంటూ ముందుకు సాగినట్లే’ అంటూ ఓ ట్వీట్‌లో ఆయన చురకలంటించారు. ఇక ఈ లేఖపై కథనాలు ప్రసారం చేస్తున్న ఓ న్యూస్ ఛానెల్‌పైనా ఆయన మండిపడ్డారు. కాగా, తథాగత వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఆయన ఓ గవర్నర్ మాదిరి కాకుండా.. బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ సీపీఎం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.
Of course I wrote that letter! It isn’t even confidential because it is a normal recommendation for a perfectly bona fide purpose. But,as I said,if you are feeling the way Columbus felt on discovering America,go ahead and make bigger fools of yourselves
— Tathagata Roy (@tathagata2) 28 April 2018
Comments
Please login to add a commentAdd a comment