అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్ శనివారం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్‌దేవ్ రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిప్లవ్‌దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిన్ ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.
కాగా, బిప్లవ్‌దేవ్ శుక‍్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత రోజే నేడు(శనివారం) రాజీనామా చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రమే కొత్త సీఎంను అధిష్టానం నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు.. వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment