తిపురలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా | Two BJP MLAs Resign From Assembly In Tripura | Sakshi

తిపురలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా

Published Tue, Feb 8 2022 7:41 AM | Last Updated on Tue, Feb 8 2022 7:41 AM

Two BJP MLAs Resign From Assembly In Tripura - Sakshi

అగర్తల: త్రిపురలో పాలక బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు సుదీప్‌రాయ్‌ బర్మన్, ఆశిష్‌ సాహా సోమవారం గుడ్‌బై చెప్పారు. శాసనసభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. వాళ్లు మంగళవారం కాంగ్రెస్‌లో చేరతారని భావిస్తున్నారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని సర్కారు జనం ఆకాంక్షలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైంది’’ అని విమర్శించారు.

మరెందరో ఎమ్మెల్యేలు బీజేపీని వీడనున్నారని, త్వరలో ప్రభుత్వం మైనారిటీలో పడటం ఖాయమని జోస్యం చెప్పారు. అయితే వారి రాజీనామాలతో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ మాణిక్‌ సాహ అన్నారు. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో రాజీనామాల తర్వాత బీజేపీ బలం 33కు తగ్గింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement