
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి(93) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్‌లోవెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి.. త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ వివాదస్పద ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఇక లేరంటూ ఆయన చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ట్వీట్ ఎలా చేస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ నిమిషాల్లో వైరల్ గా మారి.. విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన ఆ ట్వీట్‌ను తొలగించి పొరపాటు జరిగిందని క్షమాపణలు కోరారు.