'ఏం మనుషులు.. ఆ నటికి నిద్రే ముఖ్యమేమో' | Her sleep is more important: SP mocks Suchitra Krishnamoorthi | Sakshi
Sakshi News home page

'ఏం మనుషులు.. ఆ నటికి నిద్రే ముఖ్యమేమో'

Published Mon, Jul 24 2017 10:37 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

'ఏం మనుషులు.. ఆ నటికి నిద్రే ముఖ్యమేమో'

'ఏం మనుషులు.. ఆ నటికి నిద్రే ముఖ్యమేమో'

లక్నో: తెల్లవారు జామున 5గంటలకే ఆజాన్‌ ఇచ్చి నిద్రభంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించిన గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తికి సమాజ్‌వాది పార్టీకి చెందిన ఓ నేత కౌంటర్‌ ఇచ్చారు. దేవుడి ప్రార్థనకంటే ఆమెకు నిద్రే ముఖ్యమైనట్లుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు గతంలో నుంచి వస్తున్నాయి. వీళ్లంతా అసలు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. ఆమెను చూసి నాకు బాధగా ఉంది.. బహుశా ఆమెకు నిద్రనే బాగా ముఖ్యమైనట్లుంది' అని ఎస్పీ నేత జుహీ సింగ్‌ అన్నారు.

నిన్న(ఆదివారం) ఆజాన్‌ వల్ల తనకు నిద్రాభంగం కలిగిందని, అయినా, దేవుడిని ప్రార్థించాలని ఇతరులకు ఇబ్బంది కలిగేలా తెల్లవారు జామున్నే మైకుల ద్వారా చెప్పడం దేనికంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తాను బ్రహ్మముహూర్తంలోనే మేల్కొంటానని, పూజలు చేస్తానని, యోగాలాంటివి చేస్తానని, తన దేవుడిని గుర్తు చేసుకునేందుకు ప్రత్యేక లౌడ్‌ స్పీకర్స్‌ అవసరం లేదంటూ కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆమెపై ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement