Suchitra Krishnamoorthi Opens Up About Her Casting Couch Experience - Sakshi
Sakshi News home page

Suchitra Krishnamoorthi: డైరెక్టర్‌తో మీటింగ్‌.. రాత్రంతా ఉండిపో, తెల్లారాక ఇంటి దగ్గర దింపుతానన్నాడు

Published Thu, Jul 13 2023 12:36 PM | Last Updated on Thu, Jul 13 2023 1:22 PM

Suchitra Krishnamoorthi Open up on Casting Couch Experience - Sakshi

ప్రముఖ సింగర్‌, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ వస్తున్న ఆమె తాజాగా సినీపరిశ్రమలో ఎదుర్కొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని వెల్లడించింది. ఆనాడు జరిగిన సంఘటనను తలుచుకుంటూ.. 'ఆ రోజుల్లో ఆడిషన్స్‌ హోటల్‌లోనే జరిగేవి. అలా నేను ఒక డైరెక్టర్‌ను హోటల్‌లో కలిశాను. అతడు.. నీకు మీ అమ్మ ఎక్కువ క్లోజా? నాన్న ఎక్కువ చనువుగా ఉంటాడా? అని అడిగాడు.

నేను.. మా నాన్నతోనే నాకు ఎక్కువ చనువు అని చెప్పాను. ఆ తర్వాత డైరెక్టర్‌ చెప్పిన మాట విని నేను ఒక్కసారిగా షాకయ్యాను. సరే అయితే మీ నాన్నకు ఫోన్‌ చేసి నేను రేపు ఉదయం నిన్ను ఇంటి దగ్గర దింపుతానని చెప్పు అన్నాడు. మొదట అతడేం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలవుతోంది. రేపు పొద్దునవరకు ఈయనతో ఏం చేయాలి? అనుకున్నాను. కానీ అతడి మాటల వెనుక ఉన్న ఆంతర్యం అర్థమై నా కాళ్లు, చేతులు వణికిపోయాయి. దుఃఖం పొంగుకొచ్చింది.

వెంటనే నా బ్యాగు తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి పరుగుతీశాను. ఇలా చాలాసార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇంతకన్నా దారుణమైన సంఘటనలను చాలామంది ఫేస్‌ చేశారు. వారితో పోలిస్తే ఇది చాలా చిన్నది' అని చెప్పుకొచ్చింది నటి. కాగా షారుక్‌ ఖాన్‌ కబీ హా కబీ నా సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది సుచిత్రా కృష్ణమూర్తి. ఆ తర్వాత ఎన్నో హిందీ చిత్రాల్లో నటించింది. 1999లో దర్శకుడు శేఖర్‌ కపూర్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కానీ వీరి వివాహబంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఇటీవలే సుచిత్ర బ్రేవ్‌ హార్ట్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది.

చదవండి: ఇండియాలో ఎక్కువమంది చూసిన సినిమా ఏదో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement