టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ లిస్ట్-ఏ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 12,000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతను ధావన్ సాధించాడు.
కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ధావన్ బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో 297 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 12,025 పరుగులు చేశాడు. వీటిలో 162 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(21,999) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగులు వీరే
సచిన్ టెండూల్కర్(551 మ్యాచ్‌లు) - 21,999 పరుగులు
సౌరవ్ గంగూలీ(437 మ్యాచ్‌లు) -15, 622 పరుగులు
రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచ్‌లు)- 15,271 పరుగులు
విరాట్ కోహ్లీ(296 మ్యాచ్‌లు)- 13,786 పరుగులు
ఎంఎస్ ధోని(423 మ్యాచ్‌లు)- 13,353 పరుగులు
యువరాజ్ సింగ్(423 మ్యాచ్‌లు)-12,633 పరుగులు
శిఖర్ ధావన్(297 మ్యాచ్‌లు)-12,025 పరుగులు
రాణించిన ధావన్, అయ్యర్
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(72), శ్రేయస్ అయ్యర్(80), గిల్(50) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్ సాధించాడు.
చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment