
క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగుతున్న భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. కాగా 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
అనంతరం వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్‌లు రద్దు చేశారు. కాగా వరుసగా రెండు వన్డేలు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి. అంతకుముందు టీ20 సిరీస్‌లో కూడా ఆఖరి టీ20 వర్షం కారణంగానే ఎటువంటి ఫలితం తేలలేదు. ఇక తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టామ్ లాథమ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
రాణించిన వాషింగ్టన్
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(49) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, మిచెల్ తలా మూడు వికెట్లు సాధించగా.. సౌథీ రెండు, శాంట్నర్ ఒక్క వికెట్ సాధించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: Ind Vs NZ: అతడు వెలకట్టలేని ఆస్తి! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!