న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఓటమిపాలైన భారత జట్టు.. ఇప్పుడు హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలాని ధావన్ సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం హామిల్టన్‌లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
"హామిల్టన్‌లో 91 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని" అక్యూవెదర్ తమ నివేదికలో పేర్కొంది. అదేసమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 18 డిగ్రీలు, కనిష్టంగా 16 డిగ్రీల వరకు ఉండవచ్చు.
ఇక ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యహ్నాం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. ఒక వేళ ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసి నట్లయితే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా టీ20 సిరీస్‌లో కూడా వరుణుడు విలన్‌గా మారిన సంగతి తెలిసిందే. తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. మూడో టీ20కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం డ్రా ముగిసింది.
చదవండి: IPL 2023: 'వచ్చే ప్రపంచకప్ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి'.. లేకుంటే
Comments
Please login to add a commentAdd a comment