భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో వరుణుడు మరోసారి విలన్‌గా మారాడు. హామిల్టన్ వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు తొలుత వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు మూడు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు.
అయితే మళ్లీ భారత ఇన్నింగ్స్ 12.5 (89-1) వద్ద వర్షం తిరుగుముఖం పట్టింది. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత ఇన్నింగ్స్‌లో శుబ్‌మాన్ గిల్(45), సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో క్రీజులో ఉండగా మ్యాచ్ రద్దైంది.
కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం(నవంబర్ 30)న క్రైస్ట్ చర్చ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలుపొందితే 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంటుంది.
చదవండి: IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment