సెమీస్‌లో అడుగుపెట్టిన మహారాష్ట్ర (PC: BCCI Domestic Twitter)
Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Pradesh, 2nd quarter final- అహ్మదాబాద్: భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గత సోమవారం నారాయణ్ జగదీశన్ ప్రపంచ రికార్డులతో హోరెత్తించాడు. ఇప్పుడు సరిగ్గా వారం రోజుల తర్వాత ఇదే టోర్నీలో మరో బ్యాటర్ కొత్త ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
మహారాష్ట్ర కెప్టెన్, భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆరు రెగ్యులర్ బంతులతో పాటు ఒక నోబాల్ ఈ ఓవర్లో రాగా, దానిని కూడా సిక్స్‌గా మలచి రుతురాజ్ మొత్తం 43 పరుగులు రాబట్టాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది.
పాపం శివ సింగ్
దీంతో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా సమమైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ శివ సింగ్ బాధిత బౌలర్‌గా నిలిచాడు. 48 ఓవర్లో ముగిసేసరికి మహారాష్ట్ర 272/5గా ఉంది. 49వ ఓవర్ తర్వాత స్కోరు 315/5గా మారింది. ఆ ఓవర్లో రుతురాజ్ వరుసగా 6, 6, 6, 6, 6 (నోబాల్), 6, 6 బాదాడు.
వరుసగా వైడ్ లాంగాన్, లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్ మీదుగా తొలి నాలుగు సిక్సర్లు వెళ్లాయి. ఐదో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టగా, బౌలర్ గీత దాటడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు.
ఆ తర్వాత లాంగాన్, డీప్ మిడ్‌వికెట్ మీదుగా తర్వాతి రెండు సిక్సర్లను గైక్వాడ్ మలిచాడు. ఇందులో ఆరో సిక్సర్‌తో రుతురాజ్ డబుల్ సెంచరీ పూర్తయింది. చివరకు 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో అతను 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
సెమీస్‌లో మహారాష్ట్ర
ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసి సవాల్ విసరగా... 47.4 ఓవర్లలో 272 పరుగులకే ఉత్తరప్రదేశ్ ఆలౌటైంది. 58 పరుగులతో గెలిచిన మహారాష్ట్ర సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
Comments
Please login to add a commentAdd a comment