దీపక్ హుడా (PC: BCCI Domestic Twitter)
Deepak Hooda 180- VHT 2023 semi-final: టీమిండియా బ్యాటర్ దీపక్ హుడా దేశవాళీ వన్డే టోర్నీలో దుమ్ములేపాడు. విజయ్ హజారే ట్రోఫీ-2023 సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు.
లక్ష్య ఛేదనలో రెండో బ్యాటర్‌గా
తద్వారా లిస్ట్-ఏ క్రికెట్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్ తరఫున లిస్ట్- ఏ క్రికెట్‌లో లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(123 బంతుల్లో 185 పరుగులు- నాటౌట్) తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
అదే విధంగా.. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(220), రవికుమార్ సమర్థ్(192), పృథ్వీ షా(185) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపక్ హుడా చరిత్రకెక్కాడు.
మాక్స్‌వెల్‌తో పాటు ఆ జాబితాలో
అంతేగాక.. లిస్ట్-ఏ చరిత్రలో ఛేజింగ్‌లో నంబర్ 4లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన నాలుగో క్రికెటర్‌గా దీపక్ హుడా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెప్ మాక్స్‌వెల్(201*), అఫ్గనిస్తాన్ బ్యాటర్ సమీఉల్లా షెన్వారీ(192), బంగ్లాదేశ్‌కు చెందిన రకీబుల్ హసన్(190) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.
హరియాణాతో ఫైనల్లో రాజస్తాన్ అమీతుమీ
కాగా దీపక్ హుడా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రాజస్తాన్ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకతో రెండో సెమీఫైనల్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కర్ణాటక నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ దీపక్ హుడా (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాజస్తాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కరణ్ లాంబా (73 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి దీపక్ నాలుగో వికెట్‌కు 255 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో హరియాణాతో రాజస్తాన్ తలపడుతుంది.
1⃣5⃣0⃣ up for Deepak Hooda 👏👏
— BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023
He brings it up off just 108 balls.
He's played some fabulous shots. 👌👌
Follow the match ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/8qJ53nLmA6
𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 𝐜𝐫𝐮𝐢𝐬𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 👏👏
— BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023
A special partnership of 255 between Deepak Hooda (180) & Karan Lamba (73*) helps Rajasthan chase down 283 after being reduced to 23/3 👌
Scorecard ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/CQEIGoErM9
Comments
Please login to add a commentAdd a comment