KKR Vs PBKS: కేకేఆర్ ఫీల్డ‌ర్ సూప‌ర్ క్యాచ్‌.. శ్రేయ‌స్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో | IPL 2025 KKR Vs PBKS: Ramandeep Singh Takes A Stunning Catch To Dismiss Shreyas Iyer, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

KKR Vs PBKS: కేకేఆర్ ఫీల్డ‌ర్ సూప‌ర్ క్యాచ్‌.. శ్రేయ‌స్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Published Tue, Apr 15 2025 9:18 PM | Last Updated on Wed, Apr 16 2025 1:17 PM

IPL 2025: Ramandeep Singh Takes A Stunning Catch To Dismiss Shreyas Iyer

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆట‌గాడు ర‌మ‌ణ్‌దీప్ సింగ్ అద్బుత‌మైన క్యాచ్‌తో మెరిశాడు. సంచ‌లన క్యాచ్‌తో పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్ వేసిన హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో రెండో బంతికి ప్రియాన్ష్ ఆర్య ఔట‌య్యాడు.

ఆ త‌ర్వాత శ్రేయ‌స్ అయ్య‌ర్ క్రీజులోకి వ‌చ్చాడు. మూడో బంతిని డిఫెన్స్ ఆడిన అయ్య‌ర్‌.. నాలుగో బంతిని డీప్‌పాయింట్ దిశ‌గా భారీ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. షాట్ అంత ప‌వ‌ర్‌లో లేక‌పోవ‌డంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్ర‌మంలో డీప్ పాయింట్‌లో ఉన్న రమణ్‌దీప్ వేగంగా వచ్చి ముందుకు డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

అత‌డి క్యాచ్ అంతా షాక్ అయిపోయారు. దీంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ నిరాశ‌తో త‌న ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు తేలిపోయారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కేకేఆర్ బౌల‌ర్ల దాటికి 15.3 ఓవ‌ర్ల‌లో కేవలం 111 ప‌రుగులకే కుప్ప‌కూలింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రానా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

వీరితో పాటు నోకియా, వైభ‌వ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(30) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ప్రియాన్ష్ ఆర్య‌(22), శ‌శాంక్ సింగ్‌(18) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించారు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(0), గ్లెన్ మాక్స్‌వెల్‌(7) తీవ్ర నిరాశ‌ప‌రిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement