చేతిలో 8 వికెట్లు.. విజయానికి కావాల్సింది 38 బంతుల్లో 29 పరుగులు.. క్రీజులో అప్పటికే పాతుకుపోయిన ఇద్దరు బ్యాటర్లు. దీన్నిబట్టి చూస్తే సదరు జట్టు కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. శని తమ నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నట్లు.. చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న ఆ జట్టు కేవలం 23 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు చేజార్చుకొని నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
ఈ అరుదైన ఘటన ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం రాత్రి ససెక్స్, గ్లూస్టర్‌షైర్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లూస్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 66, టేలర్ 46 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ జట్టు ఆరంభంలోనే టిమ్ సీఫెర్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 10 పరుగులు చేసిన రవి బొపారా ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన టామ్ అల్‌సోప్(82 పరుగులు).. ఫిన్ హడ్సన్(18 పరుగులు) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ససెక్స్ కోలుకుంది. 13 ఓవర్ వరకు రెండు వికెట్ల నష్టానికి 11 8 పరుగులు చేసింది. 38 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో ఫిన్ హడ్సన్ స్టంప్ ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత అదే ఓవర్ ఆఖరి బంతికి టామ్ అల్‌సోప్ కూడా స‍్టంప్‌ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కేవలం 23 పరుగుల తేడా వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన ససెక్స్ 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటై కేవలం నాలుగు పరుగులతో ఓటమి చవిచూసింది. ససెక్స్ ఆట తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''నెత్తిన శని తాండవం చేస్తుంటే ఇలాగే జరుగుతుంది.. ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు'' అంటూ పేర్కొన్నారు.
చదవండి: ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్..
డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్‌లో పడ్డ బంతి.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment