Ind Vs Eng 2021: India Warm Up Match Vs County XI Schedule Announced - Sakshi
Sakshi News home page

టీమిండియాకు శుభవార్త.. కౌంటీ జట్టుతో ఈనెల 20న ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ప్రారంభం

Published Thu, Jul 15 2021 3:40 PM | Last Updated on Thu, Jul 15 2021 6:14 PM

IND Vs ENG: India Warm Up Match Vs County Championship XI Announced - Sakshi

Ind Vs Eng Warm Up Match: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు బీసీసీఐ.. టీమిండియాకు శుభవార్త చెప్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఎలాంటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లేకపోవడంతో భారత జట్టు బొక్కబోర్లా పడ్డ విషయం విధితమే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి తప్పిదం జరగకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కోహ్లీ సేనకు ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేసింది. ఈ నెల 20న డ‌ర్హ‌మ్‌లోని ఎమిరేట్స్ రివ‌ర్‌సైడ్‌లో కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ ఎలెవ‌న్‌ జట్టుతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నుంది.  ఈ విషయాన్ని డ‌ర్హ‌మ్ క్రికెట్ అధికారికంగా వెల్లడించింది. 

కాగా, డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత మూడు వారాల పాటు బ‌యో బబుల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఇండియ‌న్ క్రికెట‌ర్లు ఇవాళ లండన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ టీమిండియాకు ఓ షాకింగ్‌ వార్త తెలిసింది. టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో అత‌న్ని వ‌దిలేసి మిగతా జట్టంతా మూడు రోజుల మ్యాచ్ కోసం సిద్ధం కానుందని బీసీసీఐ వెల్లడించింది. ఇదిలా ఉంటే, భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆగ‌స్ట్ 4 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్‌ వేదికగా ప్రారంభంనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement