T20 Blast: Surrey Sunil Narine Smashes 78 Runs From 38 Balls Vs Essex - Sakshi
Sakshi News home page

బ్యాట్‌ ఝులిపించిన సునీల్‌ నరైన్‌.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసం

Jul 3 2023 11:10 AM | Updated on Jul 3 2023 11:22 AM

T20 Blast: Surrey Sunil Narine Smashes 78 Runs In 37 Balls Vs Essex - Sakshi

టీ20 బ్లాస్ట్‌లో భాగంగా ఎసెక్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ ఆటగాడు, సర్రే ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో (4-0-42-1) తేలిపోయిన నరైన్‌.. బ్యాటింగ్‌లో రాణించి అజేయమైన మెరుపు అర్ధసెంచరీతో (37 బంతుల్లో 78 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరిశాడు. నరైన్‌ బ్యాట్‌తో విజృంభించినా, అతని జట్టు సర్రే మాత్రం  విజయం సాధించలేకపోయింది.

కెప్టెన్‌ క్రిస్‌ జోర్డన్‌ (4-0-23-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ (4-0-45-1), ఆసీస్‌ పేసర్‌ సీన్‌ అబాట్‌ (4-0-47-1) సహా అంతా విఫలమయ్యారు. ఫెరోజ్‌ ఖుషి (35 నాటౌట్‌), డేనియల్‌ లారెన్స్‌ (58), మైఖేల్‌ కైల్‌ పెప్పర్‌ (75) ఎసెక్స్‌కు గెలిపించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రే.. సునీల్‌ నరైన్‌ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. నరైన్‌తో పాటు సర్రే ఆటగాళ్లు విల్‌ జాక్స్‌ (23), జేసన్‌ రాయ్‌ (28), జేమీ ఓవర్టన్‌ (23), టామ్‌ కర్రన్‌ (12) మాత్రమే రెండంకెల​ స్కోర్‌ చేశారు. ఎసెక్స్‌ బౌలర్లలో డేనియల్‌ సామ్స్‌, ఆరోన్‌ బియర్డ్‌, సామ్‌ కుక్‌, హార్మర్‌, స్నేటర్‌, పాల్‌ వాల్టర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి గెలిపించాడు..
అనంతరం బరిలోకి దిగిన ఎసెక్స్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ చివరి బంతికి విజయం సాధించింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో ఫెరోజ్‌ ఖుషీ ఆఖరి బంతికి సిక్సర్‌ బాది ఎసెక్స్‌ను గెలిపించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement