Essex
-
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం
క్రికెట్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ సీజన్ (2023) ముగిసిన అనంతరం తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు (161 టెస్ట్‌ల్లో 45.4 సగటున 33 సెంచరీలు, 57 అర్ధసెంచరీల సాయంతో 12472 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కుక్.. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆతర్వాత కంటిన్యూయెస్‌గా కౌంటీల్లో ఆడుతున్నాడు. కుక్ తన కౌంటీ జట్టైన ఎసెక్స్ తరఫున ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్‌లు ఆడిన కుక్.. 36.72 సగటున శతకం, 3 అర్ధశతకాల సాయంతో 808 పరుగులు చేశాడు. కుక్ ప్రస్తుతం హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ (0) పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌తో పాటు కుక్ మరో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సీజన్లో ఎసెక్స్కు ఇదే ఆఖరి మ్యాచ్. హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతర్వాత జరిగే మరో మ్యాచ్‌లో గెలిస్తే ఎసెక్స్కు ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డివిజన్ వన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఎసెక్స్.. టాప్‌లో ఉన్న సర్రే కంటే 15 పాయింట్లు వెనుకపడి ఉంది. ఇదిలా ఉంటే, అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో టాప్ స్కోరర్‌గా నిలువడమే కాకుండా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. -
బ్యాట్‌తో విజృంభించిన ఉమేశ్ యాదవ్
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో భాగంగా హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో కాకుండా బ్యాటింగ్‌లో చెలరేగాడు. ఎసెక్స్ తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఉమేశ్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Umesh Yadav smashed a fifty in just 45 balls in the County Championship. pic.twitter.com/2YMfZ15SDW— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 ఉమేశ్‌తో పాటు కెప్టెన్ టామ్ వెస్లీ (50), సైమర్ హార్పర్ (62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆడమ్ రొస్సింగ్టన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. మాథ్యూ క్రిచ్లీ (99) పరుగు తేడాతా శతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (0), నిక్ బ్రౌన్ (3), పాల్ వాల్టర్ (14) నిరాశపర్చగా.. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యుడు డానియెల్ లారెన్స్ (36) పర్వాలేదనిపించాడు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫెలిక్స్ ఆర్గన్, మొహమ్మద్ అబ్బాస్ తలో 2 వికెట్లు, బార్కర్, కైల్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పాయింట్ల పట్టికలో ఎసెక్స్ రెండో స్థానంలో, హ్యాంప్‌షైర్ ఐదో స్థానంలో ఉన్నాయి. సర్రే అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
టీ20 బ్లాస్ట్ 2023 విజేత సోమర్సెట్.. ఫైనల్లో ఎసెక్స్‌పై గెలుపు
2023 సీజన్ టీ20 బ్లాస్ట్ విజేతగా సోమర్సెట్ జట్టు నిలిచింది. నిన్న (జులై 15) జరిగిన ఫైనల్లో సోమర్సెట్.. ఎసెక్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని ఎసెక్స్ 18.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సోమర్సెట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4/25), ఐష్ సోధి (3/22), లెవిస్ గ్రెగరీ (2/25), క్రెయిగ్ ఓవర్టన్ (1/30) ఎసెక్స్ పతనాన్ని శాశించారు. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ సామ్స్ (45), ఆడమ్ రోసింగ్టన్ (19), డేనియల్ లారెన్స్ (16), పాల్ వాల్టర్ (26) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు సీన్ డిక్సన్ (53) రాణించడంతో సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (20), కోహ్లెర్ క్యాడ్మోర్ (19), గ్రెగరీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఎసెక్స్ బౌలర్లలో స్నేటర్, పాల్ వాల్టర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్, క్రిచ్లీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
బ్యాట్ ఝులిపించిన సునీల్ నరైన్.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసం
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా ఎసెక్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఆటగాడు, సర్రే ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో (4-0-42-1) తేలిపోయిన నరైన్.. బ్యాటింగ్‌లో రాణించి అజేయమైన మెరుపు అర్ధసెంచరీతో (37 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరిశాడు. నరైన్ బ్యాట్‌తో విజృంభించినా, అతని జట్టు సర్రే మాత్రం విజయం సాధించలేకపోయింది. కెప్టెన్ క్రిస్ జోర్డన్ (4-0-23-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (4-0-45-1), ఆసీస్ పేసర్ సీన్ అబాట్ (4-0-47-1) సహా అంతా విఫలమయ్యారు. ఫెరోజ్ ఖుషి (35 నాటౌట్), డేనియల్ లారెన్స్ (58), మైఖేల్ కైల్ పెప్పర్ (75) ఎసెక్స్కు గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. సునీల్ నరైన్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. నరైన్‌తో పాటు సర్రే ఆటగాళ్లు విల్ జాక్స్ (23), జేసన్ రాయ్ (28), జేమీ ఓవర్టన్ (23), టామ్ కర్రన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, ఆరోన్ బియర్డ్, సామ్ కుక్, హార్మర్, స్నేటర్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాడు.. అనంతరం బరిలోకి దిగిన ఎసెక్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో ఫెరోజ్ ఖుషీ ఆఖరి బంతికి సిక్సర్ బాది ఎసెక్స్‌ను గెలిపించాడు. -
లక్నో ఆల్‌రౌండర్ సిక్సర్ల సునామీ.. తడిసి ముద్ద అయిన లార్డ్స్ మైదానం
టీ20 బ్లాస్ట్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ (ఐపీఎల్) ఆల్‌రౌండర్, ఎస్సెక్స్ ఫాస్ట్ బౌలర్, ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న (జూన్ 18) మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో సామ్స్ 24 బంతుల్లో 8 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 67 పరుగులు చేశాడు. సామ్స్ సిక్సర్ల సునామీలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తడిసిముద్ద అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సామ్స్.. ఆ తర్వాత 3 బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి ఔటయ్యాడు. సామ్స్‌కు జతగా డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మైఖేల్ పెప్పర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మిడిల్సెక్స్ భారీ లక్ష్య ఛేదనకు దిగగా వర్షం అంతరాయం కలిగించింది. 12.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి మిడిల్సెక్స్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ సమీకరణల ప్రకారం మిడిల్సెక్స్ లక్ష్యానికి ఇంకా 22 పరుగులు వెనుకపడి ఉండింది. దీంతో అంపైర్లు ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజీ (28), ర్యాన్ హిగ్గిన్స్ (32) ఓ మోస్తరు పరుగులు చేయగా.. జో క్రాక్నెల్ (36 నాటౌట్), మ్యాక్స్ హోల్డన్ (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన డేనియల్ సామ్స్ ఓ వికెట్ దక్కంచుకోగా.. డేనియల్ లారెన్స్ మరో వికెట్ పడగొట్టాడు. కాగా, 31 ఏళ్ల డేనియల్ సామ్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. 2022 సీజన్లో అతను ఎంఐ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. 2023 వేలంలో సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అతను లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. టీ20 బ్లాస్ట్-2023లో భాగంగా నిన్న (జూన్ 2) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విన్స్ 45 బంతుల్లోనే శతకం బాదాడు. ఇందులో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. విన్స్ శతకాన్ని బౌండరీ, సిక్సర్‌తో కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 48 బంతులు ఎదుర్కొన్న విన్స్ 103 పరుగులు చేసి ఔటయ్యాడు. విన్స్ శతక్కొట్టుడు సాయంతో హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో లియామ్ డాసన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో హాంప్‌షైర్ 200 పరుగుల మార్కును దాటింది. విన్స్‌కు జతగా టోబి ఆల్బర్ట్ (28), వెథర్లీ (29) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, హార్మర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. క్రిచ్లీ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. లియామ్ డాసన్ (4-0-21-4), నాథన్ ఇల్లిస్ (2.1-0-10-3), స్కాట్ కర్రీ (3-0-21-3) ధాటికి 14.1 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (23), డేనియల్ లారెన్స్ (22), పాల్ వాల్టర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న విన్స్.. ఎసెక్స్‌తో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించిన విన్స్ ప్రస్తుత టీ20 బ్లాస్ట్ సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 103 పరుగులు చేసిన విన్స్.. దీనికి ముందు ససెక్స్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లో 88, మిడిల్సెక్స్తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేశాడు. 2019 ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన.. ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్ కోహ్లి దిగ్బ్రాంతి -
దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే!
అద్భుతాలు అరుదుగా చోటు చేసుకుంటాయి. కౌంటీ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సిమోన్ హార్మర్ వేసిన అద్భుత డెలివరీ బ్యాటర్ నోరళ్లబెట్టేలా చేసింది. ఇదంతా నార్తంప్టన్‌షైర్, ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఎసెక్స్ బౌలర్ సిమోన్ హార్మర్ బంతిని పూర్తిగా ఆఫ్‌స్టంప్ అవతల వేశాడు. వైడ్ వెళుతుందని భావించిన నార్తంప్టన్‌షైర్ కెప్టెన్ విల్ యంగ్ పూర్తిగా ఆఫ్‌స్టంప్ అవతలకు వచ్చాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అనూహ్యమైన టర్న్ తీసుకున్న బంతి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో అసలేం జరిగిందో అర్థంగావ విల్ యంగ్ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఆ తర్వాత అంపైర్ ఔట్ సిగ్నల్ చూపడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. కొంతమంది అభిమానులు సిమోన్ హార్మర్ వేసిన బంతిని నయా ''బాల్ ఆఫ్ ది సెంచరీగా'' అభివర్ణించడం విశేషం. ఇక సిమోన్ హార్మర్ ఆరు వికెట్లతో చెలరేగడంతో 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్ 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఎసెక్స్ 47 పరుగులతో ఘన విజయం సాధించింది. That. Is. Outrageous. Simon Harmer with a 'Ball of the Century' contender 💫#LVCountyChamp pic.twitter.com/BGBoFhkvZP — LV= Insurance County Championship (@CountyChamp) September 29, 2022 -
‘ఎసెక్స్’ విజయంలో వివాదం
లండన్: ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో తొలిసారి నిర్వహించిన ‘బాబ్ విల్లీస్ ట్రోఫీ’ని గెలుచుకున్న ఎసెక్స్ జట్టు సంబరాల్లో చిన్న అపశ్రుతి దొర్లింది. సోమర్‌సెట్‌తో జరిగిన ఫైనల్ ఆదివారం ‘డ్రా’గా ముగియగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఎసెక్స్ చాంపియన్‌గా నిలిచింది. అయితే లార్డ్స్ మైదానం బాల్కనీలో జరిగిన సంబరాల్లో ఎసెక్స్ యువ ఆటగాడు ఒకడు అత్యుత్సాహంతో తన జట్టు సహచరుడు ఫెరోజ్ ఖుషీపై బీర్ పోశాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఇంగ్లండ్ క్రికెట్లో ముస్లిం క్రికెటర్లతో గెలుపు వేడుకలు చేసుకునే సమయంలో ఇతర ఆటగాళ్లు సాధారణంగా మద్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. జాతీయ జట్టు సభ్యులైన మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లను కూడా తమ విజయంలో భాగంగా చేసి సంబరాల సమయంలో వారిపై షాంపేన్ చల్లకుండా ఉండే రివాజును ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ చాలా కాలంగా పాటిస్తోంది. తాజా ఘటనపై కూడా ఎసెక్స్ కౌంటీ జట్టు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరింది. క్రికెట్లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ను తాము గౌరవిస్తామని, తమ జట్టులో కూడా మతం, జాతి భేదాలు లేకుండా ఆటగాళ్లు ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, యువ ఆటగాళ్లకు ఈ విషయంలో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది. కుర్రాళ్లు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని, చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని ఎసెక్స్ స్పష్టం చేసింది. తాజా సీజన్లోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన 21 ఏళ్ల ఫెరోజ్ ఖుషీ ఎసెక్స్ తరఫున 4 మ్యాచ్‌లు ఆడాడు. -
ట్రక్కులో 39 మృతదేహాలు
లండన్: లండన్ దగ్గర్లో బుధవారం 39 మృతదేహాలున్న ఒక ట్రక్కు కనిపించి సంచలనానికి కారణమైంది. ఆ మృతదేహాలెవరివి, మరణాలకు కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ దగ్గర్లో ఉన్న వాటర్‌గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో మృతదేహాలున్న ఒక ట్రక్కు ఉందని బుధవారం తమకు సమాచారం వచ్చిందని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు తెలిసిందని, వేల్స్‌లోని హోలీహెడ్ రేవు ద్వారా శనివారం యూకేలోకి వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు. నార్త్ ఐర్లండ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి వివరాలు రాబడ్తున్నామని ఎసెక్స్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్య్రూ మారినర్ చెప్పారు. బల్గేరియా నుంచి అక్రమంగా బ్రిటన్‌లోకి వచ్చే క్రమంలో వారు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలున్న ట్రక్ వెనుకభాగంలో మైనస్ 25 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అందులో దాక్కుని హోలీహెడ్ రేవు ద్వారా అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇలాగే ఒక లారీ వెనుకభాగంలో దాక్కుని అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ 58 మంది చైనీయులు చనిపోయారు. -
ఫేక్ న్యూస్ ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: సోషల్‌మీడియా ద్వారా నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ద్వారా అందుకునే నకిలీ వార్తలు భారత్‌లోని ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న విషయమై బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎస్సెక్స్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ నకిలీ వార్తలు ఓటర్ల అభిప్రాయాన్ని ఎంతమాత్రం మార్చలేవనీ, అప్పటివరకూ ఉన్న ప్రజల నమ్మకాలను మరింత దృఢం చేస్తాయని పరిశోధకులు తేల్చారు. ఈ విషయమై భారత సంతతి పరిశోధకుడు సయాన్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నకిలీ వార్తలు, వదంతుల కారణంగా మతఘర్షణలు, జాతుల మధ్య గొడవలతో పాటు రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ పలు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో మేం భారత్‌లోని యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 18 లోక్‌సభ నియోజకవర్గాల్లో అధ్యయనం చేపట్టాం. ఇందులో భాగంగా 3,500 మందిని ఎంపిక చేసుకుని వారి రాజకీయ అభిరుచులను తెలుసుకున్నాం. అనంతరం వీరిలో కొందరికి సాధారణ వార్తలను, మరికొందరికి దేశభద్రత, మౌలికవసతులకు సంబంధించి నకిలీ వార్తలను పంపాం. అక్కడ రాజకీయ నేతలు, పార్టీల పేర్లను ప్రస్తావించలేదు. నకిలీ వార్తల కారణంగా ప్రజల రాజకీయ అభిప్రాయం మారకపోగా, వారిలో ప్రస్తుతమున్న భయాలు మరింత బలపడ్డాయి‘ అని తెలిపారు. వదంతులు మొదలయ్యేది ఇక్కడే.. భారత్‌లో రాజకీయ వాతావరణాన్ని నిర్దేశించేవాటిలో భద్రత, మౌలికవసతులు, ఆర్థిక రక్షణ అన్నవి కీలక పాత్ర పోషిస్తాయని సయాన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ‘భద్రతాపరమైన సమస్యలు అంటే కేవలం మీ కుటుంబం లేదా సామాజికవర్గానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. పౌర హక్కులతో పాటు న్యాయ, పోలీస్ సంస్థలు అందుబాటులో ఉండటం కూడా. పోలీస్‌శాఖతో పాటు న్యాయస్థానాల్లో దళితుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో న్యాయం పొందడం దళితులకు కష్టసాధ్యంగా మారింది. దళిత హక్కుల పరిరక్షణ కోసం తెచ్చిన చట్టాలు, రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఇక్కడి నుంచే నకిలీ వార్తల పరంపర మొదలవుతోంది’ అని తెలిపారు. ‘నకిలీ’ సంస్కృతి ఇప్పటిది కాదు.. బీజేపీలాంటి రాజకీయ పార్టీలు తీవ్రమైన ప్రభావం చూపగల సందేశాలను వాట్సాప్ గ్రూపుల్లో పంపుతోందని సయాన్ బెనర్జీ చెప్పారు. ‘ఇలాంటి సందేశాల వల్ల పెద్దగా ప్రభావం ఉండదని భావిస్తున్నా. నకిలీ వార్తలు అన్నవి కొత్తగా వచ్చినవి కావు. గతంలో ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని నియంత్రించేందుకు ఈ నకిలీ వార్తలను వాడుకున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో నకిలీ వార్తలు, వదంతుల్ని పర్యవేక్షించడం సవాలుగా మారింది. కొత్త ఓటర్లపై సోషల్ ప్రభావం ప్రస్తుతం దేశంలో తొలిసారి ఓటేస్తున్న 15 కోట్ల మంది యువతలో మూడోవంతు ఓటర్లు సోషల్‌మీడియాలో రాజకీయ సందేశాల ప్రభావానికి లోనయ్యారని ఏడీజీ ఆన్లైన్ అనే సంస్థ తెలిపింది. ఈ విషయమై ఏడీజీ సంస్థ చైర్మన్ అనూజ్ మాట్లాడుతూ..‘తొలిసారి ఓటుహక్కు పొందిన 15 కోట్ల మందిలో 30% మంది యువత సోషల్‌మీడియాలోని సందేశాలతో ప్రభావితులయ్యారు. కొత్త ఓటర్లలో సగం సోషల్‌మీడియా ద్వారా రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారు. దేశంలో 18–24 ఏళ్ల యువతలో 40% మంది రాజకీయాల గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్‌చాట్, వాట్సాప్‌లపై ఆధారపడుతున్నారు’ అని చెప్పారు. 25 లక్షల మందిని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించామని వెల్లడించారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి సోషల్‌మీడియాలో ఎన్నికల ప్రచారం పెరిగిందన్నారు. -
ఇళ్ల క్రయవిక్రయాల్లోకి ‘ఎస్సెక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు కొనుక్కోవటం అంత ఈజీ కాదు. అనువైన ప్రాంతంలో కావాలంటే కాళ్లరిగేలా తిరగాలి. మరోవంక సదరు ఇంటిని అన్ని అనుమతులు తీసుకున్నాకే బిల్డర్ నిర్మించారా? లోన్ వస్తుందా అన్న సందేహాలూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా.. ఒక్క క్లిక్‌తో సులువుగా ఇల్లు కొనుక్కునే సేవల్ని అందుబాటులోకి తెచ్చింది ‘ఎస్సెక్స్’ దేశంలో అతిపెద్ద మార్కెటింగ్ టెక్నాలజీ కంపెనీ వే2ఆన్లైన్ ఇంటెరాక్టివ్ ప్రమోట్ చేస్తున్న ‘ఎస్సెక్స్ ఇండియా’... టెక్నాలజీని ఆసరాగా కస్టమర్‌ను, బిల్డర్‌ను అనుసంధానిస్తోంది. న్యాయ సహకారంతో పాటు గృహ రుణానికీ తగిన సాయం చేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే.. ఎస్సెక్స్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్లి పేరు, మొబైల్ నంబరు, నగరం పేరు నమోదు చేస్తే చాలు. కంపెనీ ప్రతినిధి 30 నిముషాల్లో కస్టమర్‌కు కాల్ చేస్తారు. ఏ ప్రాంతంలో ఫ్లాట్/విల్లా కావాలి, ఎంతలో కావాలి? ఎప్పట్లోగా కావాలి? వంటివి అడిగి తెలుసుకుంటా రు. ఈ సమాచారం ఆధారంగా బిల్డర్‌తో కస్టమర్‌ను అనుసంధానించి సైట్ విజిట్స్ ఏర్పాటు చేస్తారు. ధరపై కొనుగోలుదారే విక్రేతతో మాట్లాడుకోవచ్చు. కస్టమర్ నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయరు. బ్యాంకు రుణం సైతం.. కస్టమర్‌కు బ్యాంకు నుంచి రుణం అందేలా సహకరిస్తామని ఎస్సెక్స్ కో–ఫౌండర్ నిర్భయ్ తనేజా సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘భవనాలకు అనుమతులన్నీ ఉన్నాయా లేదా చూస్తాం. కస్టమర్ల క్రెడిట్ స్కోరింగ్‌ను సైతం ట్రాక్ చేస్తాం. భారత్‌లో ఏటా రూ.18,000 కోట్లుగా ఉన్న రెసిడెన్షియల్ మార్కెటింగ్, సేల్స్ రంగంలో 5% వాటాను లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు. ఇప్పటి వరకు కంపెనీ రూ.3 కోట్లు వెచ్చించింది. ఆరు నెలల్లో రూ.20 కోట్ల నిధులు సమీకరించనుంది. అందరికీ ఒకే ప్లాట్‌ఫామ్.. ‘‘ఇళ్ల విక్రయానికి సంబంధించి పెద్ద పెద్ద రియల్టీ బ్రాండ్లకు సమస్యలు ఉండవు. కానీ చిన్నచిన్న బిల్డర్లకు తమ భవనాన్ని మార్కెట్ చేసుకోవడంలో చాలా పరిమితులున్నాయి. ఇదంతా ఖర్చుతో కూడుకున్నపని. దేశవ్యాప్తంగా అమ్ముడుపోని గృహాలు లక్షల్లో ఉంటాయి. చిన్న బిల్డర్ల గృహాలనూ మేం బ్రాండింగ్ చేస్తాం‘‘ అని కంపెనీ కో–ఫౌండర్ చైతన్య రెడ్డి వెల్లడించారు. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌లో మార్కెటింగ్, సేల్స్ సేవలు అందిస్తోంది. దశలవారీగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత, ముంబై, పుణే నగరాల్లో అడుగుపెడతామని చెప్పారు. -
వైరల్: కోహ్లి, ధావన్ ఏం చేశారో చూడండి
చెమ్స్‌ఫోర్డ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో చిందేసాడు. సుదీర్ఘ సిరీస్‌కు ముందు టీమిండియా కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ కోసం మైదానంలోకి వస్తున్న కోహ్లి సేనకు పంజాబీ స్టైల్లో బ్యాండ్ కొడుతూ నిర్వాహకులు స్వాగతం పలికారు. అయితే ఈ బ్యాండ్ చప్పుడు విన్న కోహ్లికి తనలోని డ్యాన్సర్ నిద్ర లేచాడు. ఎవరూ ఊహించిన విధంగా బాంగ్రా స్టెప్పుతో అదరగొట్టాడు. ఇక ఈ కెప్టెన్‌కు జతగా ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఎస్సెక్స్ జట్టు తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ ఏకైక సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 36 నాటౌట్; 7 ఫోర్లు)తో పాటు అజింక్య రహానే (27 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) నిలకడ చూపారు. అయితే, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. డిపెండబుల్ బ్యాట్స్‌మన్ పుజారా (23) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చదవండి: సన్నాహం సమాప్తం -
చిందేసిన కోహ్లి
-
పేసర్లకు ప్రాక్టీస్
చెమ్స్‌ఫోర్డ్: తొలి రోజు బ్యాట్స్‌మెన్ తడబడి నిలదొక్కుకుంటే... రెండో రోజు బౌలర్లు దొరికిన పట్టును సడలించారు. దీంతో టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కౌంటీ జట్టు ఎస్సెక్స్ పోరాడుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 322/6తో గురువారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు మరో 73 పరుగులు జోడించి 395కి ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ (82) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (51) అర్ధశతకం సాధించాడు. కరుణ్ నాయర్ (4) విఫలం కాగా... రవీంద్ర జడేజా (15) తోడుగా రిషభ్ పంత్ (26 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) సహజ శైలిలో ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎస్సెక్స్ గురువారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఒక దశలో 45/2తో నిలిచిన జట్టును కెప్టెన్ థామస్ వెస్లీ (89 బంతుల్లో 57; 11 ఫోర్లు), స్టీవెన్ పెపెర్ (74 బంతుల్లో 68; 15 ఫోర్లు) ఆదుకున్నారు. భారత బౌలర్లను ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్న వీరు మూడో వికెట్‌కు 95 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. అయితే, వెస్లీని పెవిలియన్ పంపి శార్దుల్ ఠాకూర్ ఈ జోడీని విడదీశాడు. రిషి పటేల్ (19) అండగా నిలవడంతో పెపెర్ జోరు చూపాడు. అతను బౌండరీలతోనే 60 పరుగులు చేయడం విశేషం. ఈ దశలో ఇషాంత్, ఉమేశ్ మరోసారి విజృంభించి 17 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరిని అవుట్ చేశారు. ప్రస్తుతం వికెట్ కీపర్ ఫోస్టర్ (23 బ్యాటింగ్), వాల్టర్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉండగా జట్టు మరో 158 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో షమీ 13 ఓవర్లు వేసినా వికెట్ పడగొట్టలేకపోయాడు. జడేజా రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. అశ్విన్‌కు గాయం! రెండో రోజు అశ్విన్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడానికి గాయం కారణమని తెలిసింది. ఆటకు ముందు ఉదయం నెట్‌ప్రాక్టీస్ సమయంలో బ్యాటింగ్ చేస్తుండగా అతని చేతికి స్వల్ప గాయమైంది. లంచ్ సమయంలో నెట్స్‌లో కొన్ని బంతులు విసిరినా అతను అసౌకర్యంగా కనిపించాడు. అయితే ఆందోళన పడాల్సిన విషయం ఏమీ లేదని జట్టు మేనేజ్మెంట్ వెల్లడించినట్లు సమాచారం. -
ఆటాడుకున్నారు
చెమ్స్‌ఫోర్డ్: సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఎస్సెక్స్ కౌంటీ జట్టుతో బుధవారం ఇక్కడ ప్రారంభమైన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 322/6తో మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన... ఓపెనర్ ధావన్ (0), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా (1), అజింక్య రహానే (17) వికెట్లను త్వరగానే కోల్పోయింది. దీంతో 44/3తో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో మరో ఓపెనర్ మురళీ విజయ్ (113 బంతుల్లో 53; 7 ఫోర్లు)కి కెప్టెన్ విరాట్ కోహ్లి (93 బంతుల్లో 68; 12 ఫోర్లు) జత కలిశాడు. నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించాక వీరు వెంటవెంటనే ఔటయ్యారు. అనంతరం ఎడాపెడా బౌండరీలు బాదుతూ కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 58; 12 ఫోర్లు), వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (94 బంతుల్లో 82 బ్యాటింగ్; 14 ఫోర్లు) స్కోరును ముందుకు నడిపించారు. ఆరో వికెట్‌కు మంచి రన్‌రేట్‌తో 114 పరు గులు జోడించారు. రాహుల్ వెనుదిరిగాక వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (56 బంతుల్లో 33 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా బ్యాట్ ఝళిపించడంతో జట్టు 300 మార్కును దాటింది. ఎస్సెక్స్ బౌలర్లలో కోల్స్ (2/31), వాల్టర్ (2/90) రెండేసి వికెట్లు పడగొట్టారు. -
నీలినింగిలో షి‘కార్లు’...
ఈ కార్ల విన్యాసాలు చూసి ఒళ్లు గగుర్పొడుస్తుందా? అలా గాలిలోకి దూసుకుపోతున్న కార్లు సురక్షితంగా కిందకు ఎలా వస్తాయా అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించకండి.. ఎందుకంటే అవి కిందకు రావు.. అక్కడే అలాగే ఉంటాయి! ఔను.. నిజం.. అవి నిజమైన వాహనాలు కావు. బ్రిటన్‌లోని ఎస్సెక్స్‌లో ప్రతి ఏటా ‘గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్’ పేరుతో ఓ వేడుక నిర్వహిస్తారు. అందులో జెర్రీ జుదా అనే శిల్పకళా నిపుణుడు నిజమైన కార్లే పోటీపడుతున్నట్టుగా చిత్రవిచిత్ర ఆకారాల్లో ఇలాంటి నిర్మాణాలు రూపొందిస్తుంటాడు. ఇవన్నీ ఒక్కో ఏడాది అతడు రూపొందించిన కళాత్మక కట్టడాలు. బావున్నాయి కదూ..! -
ఎస్సెక్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ షాక్!
స్వదేశంలోనే కాకుండా.. ఇంగ్లీష్ క్రికెట్ కౌంటీలో సరియైన ఫామ్ ను ప్రదర్శించలేకపోతున్న భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎస్సెక్స్ జట్టుకు షాకిచ్చాడు. కాంట్రాక్టు పూర్తి కాకుండానే ఎస్సెక్స్ జట్టును మధ్యలోనే వదిలేసి భారత్ బాట పట్టాడు. కుటుంబ కారణాల కారణాలను చూసి ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడుతున్న క్రికెటర్ గౌతమ్ గంభీర్ మధ్యలోనే ఎస్సెక్స్ జట్టును వదిలి భారత్ చేరుకున్నారు. కుటుంబ కారణాల వల్ల ఎస్సెక్స్ జట్టును మధ్యలోనే వదిలి వెళ్లాడని ఎస్సెక్స్ క్రికెట్ జట్టు అధికారులు కూడా వెల్లడించారు. ఆగస్టు నెలలో గౌతమ్ గంభీర్ ఎస్సెక్స్ జట్టుతో చేరాడు. ఎస్సెక్స్ జట్టు తరపున ఆడిన గంభీర్ 31, 21, 2, 0 పరుగులతోపాటు గ్లూసెస్టెర్ షైర్ జట్టుపై సెంచరీ సాధించాడు. భారత జట్టు తరపున గత జనవరిలో ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో గంభీర్ ఆడాడు. -
సెంచరీతో ఆకట్టుకున్న గౌతం గంభీర్
బ్రిస్టోల్: భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న గౌతం గంభీర్ కౌంటీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లిష్ కౌంటీల్లో ఎసెక్స్ తరుపున బరిలోకి దిగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా ఎసెక్స్-గ్లోసెష్టైర్ల మధ్య జరుగుతున్నసెకెండ్ ఇన్నింగ్స్‌లో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. 144 బంతులు ఎదుర్కొన్న గౌతం వంద పరుగులు చేసి జట్టు మంచి ఇన్నింగ్స్ చేయడంలో తోడ్పడ్డాడు. ఎసెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ప్రో 40 మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో అనూహ్యంగా బరిలోకి దిగి తనలో సత్తా చాటలేదని మరోసారి నిరూపించాడు. ఈ సెంచరీతో గౌతం గంభీర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 34 వ సెంచరీ మార్కును చేరుకున్నాడు. -
సెంచరీతో ఆకట్టుకున్న గౌతం గంభీర్
బ్రిస్టోల్: భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న గౌతం గంభీర్ కౌంటీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లిష్ కౌంటీల్లో ఎసెక్స్ తరుపున బరిలోకి దిగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా ఎసెక్స్-గ్లోసెష్టైర్ల మధ్య జరుగుతున్నసెకెండ్ ఇన్నింగ్స్‌లో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. 144 బంతులు ఎదుర్కొన్న గౌతం వంద పరుగులు చేసి జట్టు మంచి ఇన్నింగ్స్ చేయడంలో తోడ్పడ్డాడు. ఎసెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ప్రో 40 మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో అనూహ్యంగా బరిలోకి దిగి తనలో సత్తా చాటలేదని మరోసారి నిరూపించాడు. ఈ సెంచరీతో గౌతం గంభీర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 34 వ సెంచరీ మార్కును చేరుకున్నాడు. -
కౌంటీలకు గంభీర్
న్యూఢిల్లీ: భారత జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్.. కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఎసెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ప్రో 40 మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో గంభీర్‌ను తీసుకున్నారు. ‘ఎసెక్స్ ఈగల్స్ తరఫున నేటి నుంచి కౌంటీ క్రికెట్ ఆడబోతున్నా’ అని గౌతీ ట్వీట్ చేశాడు. గంభీర్‌తో ఒప్పందం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎసెక్స్ ప్రధాన కోచ్ పాల్ గ్రెసన్ అన్నారు. చావ్లా కూడా...: లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఈ మేరకు భారత బోర్డు అతనికి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) ఇచ్చింది. ఈ సీజన్లో అతను సోమర్సెట్ తరఫున బరిలోకి దిగనున్నాడు. చావ్లా 2009లో సస్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.