అద్భుతాలు అరుదుగా చోటు చేసుకుంటాయి. కౌంటీ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సిమోన్ హార్మర్ వేసిన అద్భుత డెలివరీ బ్యాటర్ నోరళ్లబెట్టేలా చేసింది. ఇదంతా నార్తంప్టన్‌షైర్, ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఎసెక్స్ బౌలర్ సిమోన్ హార్మర్ బంతిని పూర్తిగా ఆఫ్‌స్టంప్ అవతల వేశాడు. వైడ్ వెళుతుందని భావించిన నార్తంప్టన్‌షైర్ కెప్టెన్ విల్ యంగ్ పూర్తిగా ఆఫ్‌స్టంప్ అవతలకు వచ్చాడు.
అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అనూహ్యమైన టర్న్ తీసుకున్న బంతి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో అసలేం జరిగిందో అర్థంగావ విల్ యంగ్ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఆ తర్వాత అంపైర్ ఔట్ సిగ్నల్ చూపడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. కొంతమంది అభిమానులు సిమోన్ హార్మర్ వేసిన బంతిని నయా ''బాల్ ఆఫ్ ది సెంచరీగా'' అభివర్ణించడం విశేషం.
ఇక సిమోన్ హార్మర్ ఆరు వికెట్లతో చెలరేగడంతో 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్ 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఎసెక్స్ 47 పరుగులతో ఘన విజయం సాధించింది.
That. Is. Outrageous.
— LV= Insurance County Championship (@CountyChamp) September 29, 2022
Simon Harmer with a 'Ball of the Century' contender 💫#LVCountyChamp pic.twitter.com/BGBoFhkvZP
Comments
Please login to add a commentAdd a comment