
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనిని దగ్గరి నుంచి చూడడమే ఆయన అభిమానులు దేవుడి వరంలా భావిస్తుంటారు. అలాంటిది ధోనితో ఫోటోలు దిగాలనుకోవడం కాస్త రిస్కే. ఎందుకంటే మ్యాచ్‌లు లేని సమయంలో ధోని ప్రైవసీ ఎక్కువగా కోరుకుంటాడు. సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగానే ఉంటాడు. తన భార్య సాక్షి సింగ్ పుణ్యమా అని ధోని అప్‌డేట్స్ తెలుస్తుంటాయి. అలాంటి ధోని ఫ్లైట్‌లో నిద్రపోతున్న వేళ అతని వీరాభిమాని అయిన ఒక ఎయిర్ హోస్టెస్ వీడియో తీయడం వైరల్‌గా మారింది.
ధోని నిద్రపోతున్న వీడియోనూ తానే స్వయంగా షూట్ చేసిన ఎయిర్‌హోస్టెస్ ముందు తన మొహాన్ని చూపించి ఆ తర్వాత క్యాబిన్‌లో ధోని నిద్రపోతున్న వీడియోనూ తీసింది. ధోని పక్కనే అతని భార్య సాక్షి సింగ్ ఫోన్ చూస్తూ ఉండడం వీడియోలో గమనించొచ్చు. తన అభిమాన ఆటగాడిని చూసిన సంతోషంలో ఎయిర్‌హోస్టెస్ మొహం నవ్వుతో వెలిగిపోయింది. ధోనితో ఫోటో దిగాలన్న తన కోరిక ఇలా అయినా నెరవేరిందనుకుంటా. అయితే మంచి మనసు స్వభావం కలిగిన ధోని దగ్గరకి వెళ్లి సెల్పీ అడిగి ఉంటే కచ్చితంగా ఇచ్చేవాడేమో. కానీ నిద్రపోతున్న ధోనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలా దొంగచాటుగా వీడియో తీసుకొని మురిసిపోయింది.
అయితే ఇది చూసిన అభిమానులు ఇతరుల ప్రైవసీకి భంగం కలిగిస్తే ఇలా వీడియోలు తీయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేయగా.. కొందరు మాత్రం తమ రోల్‌మోడల్‌గా భావించే వ్యక్తి మన కళ్ల ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఆనందం వర్ణించలేని విధంగా ఉంటుందని పేర్కొన్నారు.
MS Dhoni is an emotion, He's everyone's favourites.
— CricketMAN2 (@ImTanujSingh) July 29, 2023
What a beautiful video! pic.twitter.com/GSxgXpArc2
ఇక 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇప్పుడు బ్యాట్ పట్టి మైదానంలోకి అడుగుపెడితే టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవుతున్నాయి. అది ఎలా ఉంటుందో ఇటీవలే ఐపీఎల్ 2023 సీజన్‌లో రుచి చూశాం. ఇక 2023 ఐపీఎల్‌లో సీఎస్‌కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోని నేతృత్వంలో సీఎస్‌కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఇక వచ్చే సీజన్‌లో ధోని బరిలోకి దిగేది లేనిది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే వచ్చే సీజన్ ఆడే విషయమై మరో ఏడు-ఎనిమిది నెలల్లో నిర్ణయం తీసుకుంటానని ధోనినే స్వయంగా చెప్పాడు.
చదవండి: Ashes 2023: ఒకరి జెర్సీని మరొకరు.. 'మతిమరుపు' గానీ వచ్చిందా?
ICC ODI WC 2023: గుడ్‌న్యూస్.. ఆగస్టు 10 నుంచి వన్డే వరల్డ్‌కప్ టికెట్లు అందుబాటులో!