T20 Blast 2023: James Vince Hits Century In 45 Balls Vs Essex, Check Details Inside - Sakshi
Sakshi News home page

T20 Blast 2023: విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌

Published Sat, Jun 3 2023 3:29 PM | Last Updated on Sat, Jun 3 2023 4:02 PM

T20 Blast 2023: James Vince Slams Ton In 45 Balls Vs Essex - Sakshi

ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ జేమ్స్‌ విన్స్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. టీ20 బ్లాస్ట్‌-2023లో భాగంగా నిన్న (జూన్‌ 2) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విన్స్‌ 45 బంతుల్లోనే శతకం బాదాడు. ఇందులో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. విన్స్‌ శతకాన్ని బౌండరీ, సిక్సర్‌తో కంప్లీట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 48 బంతులు ఎదుర్కొన్న విన్స్‌ 103 పరుగులు చేసి ఔటయ్యాడు.

విన్స్‌ శతక్కొట్టుడు సాయంతో హాంప్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో లియామ్‌ డాసన్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదడంతో హాంప్‌షైర్‌ 200 పరుగుల మార్కును దాటింది. విన్స్‌కు జతగా టోబి ఆల్బర్ట్‌ (28), వెథర్లీ (29) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఎసెక్స్‌ బౌలర్లలో డేనియల్‌ సామ్స్‌, హార్మర్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. క్రిచ్లీ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్‌..  లియామ్‌ డాసన్‌ (4-0-21-4), నాథన్‌ ఇల్లిస్‌ (2.1-0-10-3), స్కాట్‌ కర్రీ (3-0-21-3) ధాటికి 14.1 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో ఆడమ్‌ రొస్సింగ్టన్‌ (23), డేనియల్‌ లారెన్స్‌ (22), పాల్‌ వాల్టర్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

భీకర ఫామ్‌లో ఉన్న విన్స్‌..
ఎసెక్స్‌తో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించిన విన్స్‌ ప్రస్తుత టీ20 బ్లాస్ట్‌ సీజన్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 103 పరుగులు చేసిన విన్స్‌.. దీనికి ముందు ససెక్స్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లో 88, మిడిల్‌సెక్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేశాడు. 2019 ఇంగ్లండ్‌ వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యుడైన.. ప్రస్తుతం ఇంగ్లండ్‌ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. 

చదవండి: ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్‌ కోహ్లి దిగ్బ్రాంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement