James Vince
-
సత్తా చాటిన క్రెయిగ్ ఓవర్టన్, జేమ్స్ విన్స్
పురుషుల ద హండ్రెడ్ లీగ్‌లో నిన్న (జులై 24) సథరన్ బ్రేవ్, లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. క్రెయిగ్ ఓవర్టన్ (20-8-16-3), టైమాల్ మిల్స్ (20-7-37-2), క్రిస్ జోర్డన్ (15-5-26-2), జేమ్స్ కోల్స్ (5-3-2-1) దెబ్బకు నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లండన్ స్పిరిట్ ఇన్నింగ్స్‌లో డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 38; 3 ఫోర్లు), లియామ్ డాసన్ (19 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా విఫలమయ్యారు. స్టార్ ఆటగాళ్లు హెట్‌మైర్ (5), ఆండ్రీ రసెల్ (13) దారుణంగా నిరాశపరిచారు.అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ బ్రేవ్.. జేమ్స్ విన్స్ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్ హ్యూస్ (30 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ల్యూస్ డు ప్లూయ్ (19 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్) సత్తా చాటడంతో 89 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లండన్ స్పిరిట్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్, బొపారా, డేనియల్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.ఇదే ఫ్రాంచైజీ మహిళా జట్ల మధ్య నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో లండన్ స్పిరిట్.. సథరన్ బ్రేవ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా..లండన్ స్పిరిట్ మరో మూడు బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హీథర్ నైట్ (65 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లండన్ స్పిరిట్‌ను గెలిపించింది. అంతకుముందు సథరన్ బ్రేవ్ ఇన్నింగ్స్‌లో డేనియల్ వ్యాట్ (59) అర్ద సెంచరీతో రాణించింది. -
అరివీర భయంకర ఫామ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్.. నిర్దాక్షిణ్యంగా ఊచకోత
ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ విన్స్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 బ్లాస్ట్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాడు. ఆడిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలుస్తున్నాడు. ససెక్స్‌తో నిన్న (జూన్ 3) జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న విన్స్.. 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ విన్స్ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించాడు. తొలుత మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేసిన విన్స్.. ఆతర్వాత ససెక్స్‌పై 56 బంతుల్లో 88 పరుగులు, ఎసెక్స్‌పై 48 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎసెక్స్‌పై చేసిన మెరుపు సెంచరీలో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న ఈ హ్యాంప్‌షైర్ ఆటగాడు.. మున్ముందు మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఇంగ్లండ్ అభిమానులు అనుకుంటున్నాడు. ఇక ససెక్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హ్యాంప్‌షైర్ తొలుత బౌలింగ్ చేసింది. లియామ్ డాసన్ (4-0-18-2), స్కాట్ కర్రీ (2/25), జేమ్స్ ఫుల్లర్ (1/9), వుడ్ (1/32), మేసన్ క్రేన్ (1/32) ధాటికి ససెక్స్ 18.5 ఓవర్లలో 144 పరుగులె మాత్రమే చేసి ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు బెన్ మెక్ డెర్మాట్ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయమైన అర్ధశతకాలతో హ్యాంప్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయయంతో హ్యాంప్‌షైర్ సౌత్ గ్రూప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సోమర్సెట్ ,సర్రే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. టీ20 బ్లాస్ట్-2023లో భాగంగా నిన్న (జూన్ 2) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విన్స్ 45 బంతుల్లోనే శతకం బాదాడు. ఇందులో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. విన్స్ శతకాన్ని బౌండరీ, సిక్సర్‌తో కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 48 బంతులు ఎదుర్కొన్న విన్స్ 103 పరుగులు చేసి ఔటయ్యాడు. విన్స్ శతక్కొట్టుడు సాయంతో హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో లియామ్ డాసన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో హాంప్‌షైర్ 200 పరుగుల మార్కును దాటింది. విన్స్‌కు జతగా టోబి ఆల్బర్ట్ (28), వెథర్లీ (29) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, హార్మర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. క్రిచ్లీ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. లియామ్ డాసన్ (4-0-21-4), నాథన్ ఇల్లిస్ (2.1-0-10-3), స్కాట్ కర్రీ (3-0-21-3) ధాటికి 14.1 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (23), డేనియల్ లారెన్స్ (22), పాల్ వాల్టర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న విన్స్.. ఎసెక్స్‌తో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించిన విన్స్ ప్రస్తుత టీ20 బ్లాస్ట్ సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 103 పరుగులు చేసిన విన్స్.. దీనికి ముందు ససెక్స్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లో 88, మిడిల్సెక్స్తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేశాడు. 2019 ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన.. ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్ కోహ్లి దిగ్బ్రాంతి -
మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్, పాక్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50 స్కోర్లు చేసిన రిజ్వాన్.. నిన్న (ఫిబ్రవరి 22) కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింతగా రెచ్చిపోయి ఉగ్రరూపం దాల్చాడు. 60 బంతుల్లోనే శతకం బాది, పీఎస్ఎల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు 42 బంతులు తీసుకున్న రిజ్వాన్.. రెండో హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేసి పీఎస్ఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ⚠️ Riz-storm! #MohammadRizwan #HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/hWD3IdESrP — Alex Cricket Prediction (@alex_prediction) February 22, 2023 ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో కరాచీ కింగ్స్ సైతం అద్భుతంగా పోరాడింది. జేమ్స్ విన్స్ (34 బంతుల్లో 75; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (26 బంతుల్లో 46 నాటౌట్; 5 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ ఆ జట్టు లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో కరాచీ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. కింగ్స్ జట్టులో విన్స్, ఇమాద్ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేదు. కాగా, ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 109.66 సగటున, 144 స్ట్రయిక్ రేట్‌తో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేసి, సీజన్ టాప్ స్కోరర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఓవరాల్‌గా రిజ్వాన్ గత 10 టీ20 ఇన్నింగ్స్‌లో 6 హాఫ్‌సెంచరీలు, ఓ సెంచరీ సాధించి కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అతని ఫామ్ కారణంగా ముల్తాన్ సుల్తాన్స్ ప్రస్తుత సీజన్లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
తుస్సుమన్న షాహీన్ అఫ్రిది.. మెరిసిన జేమ్స్ విన్స్, మాథ్యూ వేడ్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో కరాచీ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కింగ్స్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. లహోర్ ఖలందర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ 67 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్), జేమ్స్ విన్స్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లాహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది, జమాన్ ఖాన్, హరీస్ రౌఫ్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. అఫ్రిది వికెట్ పడగొట్టినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. కింగ్స్ బౌలర్లు అకీఫ్ జావిద్ (4/28), అమెర్ యామిన్ (2/18), బెన్ కట్టింగ్ (2/12), మహ్మద్ అమీర్ (1/12) ధాటికి 17.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో మీర్జా తాహిర్ బేగ్ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కమ్రాన్ గులామ్ (23), సికందర్ రజా (18), ఫకర్ జమాన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముల్తాన్ సుల్తాన్స్ టాప్‌లో (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) ఉండగా.. కరాచీ కింగ్స్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), ఇస్లామాబాద్ యునైటెడ్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), క్వెట్టా గ్లాడియేటర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), పెషావర్ జల్మీ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), లాహోర్ ఖలందర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
ముంబై ఎమిరేట్స్ ఔట్.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2023 ఫైనల్లో గల్ఫ్ జెయింట్స్ అడుగుపెట్టింది. దుబాయ్ వేదికగా క్వాలిఫియర్-2లో ఎంఐ ఎమిరేట్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్‌ను గల్ఫ్ జెయింట్స్ ఖారారు చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. జెయింట్స్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు, బ్రావో, బౌల్ట్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బ్యాటర్లలో కెప్టెన్ పొలార్డ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ మహ్మద్ వసీం 31 పరుగులతో రాణించాడు. ఇక ఫిబ్రవరి 12 దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో డిసార్ట్ వైపర్స్‌తో జెయింట్స్ తలపడనుంది. చదవండి: T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! We have our second finalist! 🙌@GulfGiants beat @MIEmirates by 4 wickets and make a dashing entry into the FINAL of the #DPWorldILT20. Congratulations 👏#DPWorldILT20 #ALeagueApart #GGvMIE pic.twitter.com/7AQTvcJdlo — International League T20 (@ILT20Official) February 10, 2023 -
David Wiese: ఐదేసి ఇరగదీసిన వీస్.. వారియర్స్ ఖేల్ ఖతం
ఇనాగురల్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2023 (దుబాయ్ లీగ్)లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలవ్వడంతో షార్జా వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది. జెయింట్స్ పేసర్, వెటరన్ ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ ఐదు వికెట్లు (4-0-20-5) తీసి అదరగొట్టడంతో జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జెయింట్స్.. వారియర్స్‌ను 18.3 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్ కాడ్మోర్ (33), స్టోయినిస్ (18), మహ్మద్ నబీ (21), నూర్ అహ్మద్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్ కాడ్మోర్ ఆరంభంలో మెరుపు వేగంతో పరుగులు చేసి జెయింట్స్ బౌలర్లను భయపెట్టాడు. అయితే టామ్ హెల్మ్ కాడ్మోర్కు కళ్లెం వేయడంతో వారియర్స్ ఢీలా పడిపోయి వరుసగా వికెట్లు కోల్పోయింది. జెయింట్స్ బౌలర్లలో వీస్ ఐదేయగా.. కార్లోస్ బ్రాత్‌వైట్ 2, సంచిత్ శర్మ, టామ్ హెల్మ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామ్ బాంటన్ (11), కెప్టెన్ జేమ్స్ విన్స్ (27), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (35), అయాన్ అఫ్జల్ ఖాన్ (14 నాటౌట్), గెర్హార్డ్ ఎరాస్మస్ (10 నాటౌట్) రాణించారు. వారియర్స్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 2, మార్కస్ స్టోయినిస్ ఓ వికెట పడగొట్టారు. ఈ విజయంతో వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించగా.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ క్వాలిఫయర్స్‌కు.. 3, 4 స్థానాల్లో నిలిచిన ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌ను అర్హత సాధించాయి. 6 జట్లలో చివరి స్థానంలో నిలిచిన అబుదాబీ నైట్‌రైడర్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించింది. ఫిబ్రవరి 8: గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ (క్వాలిఫయర్స్ 1) ఫిబ్రవరి 9: ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ (ఎలిమినేటర్) -
న్యూజిలాండ్ తో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్...
Jason Roy ruled out of the T20 World Cup: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్‌తో సెమిఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్దానంలో జేమ్స్ విన్స్ జట్టులోకి వచ్చి చేరాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ రాయ్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడి 123 పరుగులు చేశాడు. "ఇది నిజంగా చాలా భాదాకరమైన వార్త. కానీ నేను మా జట్టును సపోర్ట్ చేయడానికి ఇక్కడే ఉంటాను. మేము కచ్చితంగా ట్రోఫీని సాధిస్తాము. ఈ టోర్నమెంట్లో నా ప్రయాణం ఎంతో ఆద్బుతమైనది. గాయం నుంచి తొందరగా కోలుకోని కరీబియన్ టూర్‌కు సిద్దంగా ఉంటాను" అని రాయ్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడి 123 పరుగులు చేశాడు. ప్రపంచకప్ లో నవంబర్ 10 న న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగనున్న తొలి సెమీస్ జరగనుంది. చదవండి: Gautam Gambhir: దయచేసి అర్థం చేసుకోండి.. టీమిండియాను తిట్టొద్దు -
ఒక మ్యాచ్‌లో సెంచరీ; మరో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ.. రెండూ ఒకేరోజు
సౌతాంప్టన్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా హాంప్‌షైర్ ఆటగాడు... కెప్టెన్ జేమ్స్ విన్స్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకేరోజు రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో మెరుపు సెంచరీ, హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ముందుగా ససెక్స్, హాంప్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ విన్స్ మెరుపు సెంచరీ సాధించాడు. జేమ్స్ విన్స్ (59 బంతుల్లో 102; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మరో 16 పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తామన్న సమయంలో ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో దురదృష్టవశాత్తు హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే ససెక్స్‌కు చేయాల్సిన నష్టం చేసే వెళ్లాడు. ఆ తర్వాత జో వెథర్లీ 24 నాటౌట్, లూయిస్ మెక్‌మనస్ 3 నాటౌట్ మిగతా పనిని పూర్తి చేశారు. మరో ఓపెనర్ డీ ఆర్సీ షార్ట్ 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రవి బొపారా 62, లూక్ రైట్ 54 పరుగులు చేశారు. ఇక హాంప్‌షైర్ ఈసెక్స్తో జరిగిన మ్యాచ్‌లోనూ జేమ్స్ విన్స్ అర్థసెంచరీతో మెరవడం విశేషం. ఈ మ్యాచ్‌లోనూ విన్స్ టాప్ స్కోరర్‌గా నిలవడం.. హాంప్‌షైర్ మరో విజయాన్ని అందుకోవడం మరో విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విన్స్ 63, డీ ఆర్సీ షార్ట్ 30, గ్రాండ్‌హోమ్ 32 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈసెక్స్ 153 పరుగులకే ఆలౌట్ అయింది. డానియెల్ లారెన్స్ 60, టామ్ వెస్లీ 39 మినహా మరెవరు రాణించలేకపోయారు. ఇక జేమ్స్ విన్స్‌కు ఈ వారం అత్యుత్తమంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. విన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ఫిఫ్టీలు, రెండు సెంచరీలు అందుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన విన్స్.. అదే జట్టుతో జరిగిన మరో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజాగా టీ20 బ్లాస్ట్‌లో వరుస మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ, సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. -
బాబర్ అజమ్ అద్భుత సెంచరీ; వైట్‌వాష్ మాత్రం తప్పలేదు
బర్మింగ్హమ్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుత సెంచరీతో మెరిసినా జట్టుకు పరాభవం తప్పలేదు. వరుసగా మూడో వన్డేలోనూ ఓడిన పాక్ ఇంగ్లండ్‌కు సిరీస్‌ను అప్పగించింది. 3-0 తేడాతో సిరీస్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేసేసింది. కాగా సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ జట్టులో నలుగురు ఆటగాళ్లు కరోనా బారీన పడడంతో అప్పటికప్పుడు స్టోక్స్‌ను కెప్టెన్‌గా నియమించిన ఈసీబీ అందుబాటులో ఉన్న రెండో జట్టును ఆడించింది. ఇది మంచి అవకాశంగా భావించాల్సిన పాక్ వన్డే సిరీస్‌లో ఆధ్యంతం చెత్త ప్రదర్శనను నమోదు చేసి సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్(102, 95 బంతులు; 11 ఫోర్లు) మొయిడెన్ సెంచరీతో జట్టును గెలిపించగా.. చివర్లో లూయిస్ జార్జరీ 77 పరుగులుతో రాణించాడు. అంతకముందు పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. బాబర్ అజమ్(158,139 బంతులు; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ ఇమామ్ హుల్ హక్ 56, కీపర్ రిజ్వాన్ 74 పరుగులు చేశారు. సెంచరీతో ఆకట్టుకున్న జేమ్స్ విన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా, బౌలర్ సకీబ్ మహమూద్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. -
ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా!
కాన్బెర్రా: బిగ్‌బాష్ లీగ్‌లో శనివారం పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్ 98* పరుగులతో వీరవిహారం చేసి ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే విన్స్ సెంచరీ మిస్ కావడానికి పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టై పరోక్ష కారణమయ్యాడు. వాస్తవానికి సిడ్నీ జట్టుకు చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో విన్స్ 98 పరుగులతో ఉన్నాడు. విజయానికి ఒక పరుగు దూరం.. అతని సెంచరీకి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆండ్రూ టై కావాలని చేశాడో.. యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కాని అతను వేసిన బంతి వైడ్ వెళ్లింది. దీంతో సిడ్నీ సిక్సర్స్ పరుగు అవసరం లేకుండా ఎక్స్ట్రా రూపంలో విజయం సాధించినా... విన్స్‌కు మాత్రం నిరాశ మిగిలింది. ఆండ్రూ టై చేసిన పనిపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. 'ఎలాగో మ్యాచ్ ఓడిపోతారని తెలుసు.. విన్స్‌ను సెంచరీ చేయిస్తే బాగుండేది.. ఆండ్రూ టై కావాలనే ఇదంతా చేశాడు' అంటూ కామెంట్స్ రాసుకొచ్చారు. ఆండ్రూ టై చేసిన పనిపై విన్స్ స్పందించాడు. ఆండ్రూ టై కావాలనే ఆ పని చేశాడా అనేది అతనికి తెలియాలి. నేను సెంచరీ మిస్ అయినందుకు బాదేం లేదు.. ఎందుకంటే జట్టును ఫైనల్ చేర్చాననే సంతోషం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. అప్పటికి అతను వేసిన బంతిని టచ్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ బ్యాట్‌కు దూరంగా బంతి వైడ్ రూపంలో వెళ్లింది. ఒక బౌలర్‌గా ఆలోచించిన టై.. అతని బౌలింగ్‌లో సెంచరీ చేసే అవకాశం ఇవ్వకూడదనే అలా చేశాడు. ఈ విషయంలో ఆండ్రూ టైది కూడా తప్పు అనలేం. అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: వైరల్: బాబు ఈ కొత్త షాట్ పేరేంటో కాగా ఆండ్రూ టై చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విన్స్ సెంచరీ కాకుండా వైడ్ వేయాలని ఆండ్రూ టై దగ్గరకు ఎవరు వచ్చి చెప్పలేదు.. కావాలనే అతను బంతిని వైడ్ వేశాడు. నిజంగా టై నుంచి ఇలాంటిది ఆశించలేదు. అంటూ విరుచుకుపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ టర్నర్ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ జోష్ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అంపైర్‌ను తిట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు -
కరోనా: వారు మరీ ఇంత స్వార్థపరులా?
లండన్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే కొన్నిచోట్ల ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. ఇక బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు లాక్డౌన్ సక్రమంగా పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపట్ల ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్సే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ప్రజలు సాధారణ పరిస్థితుల్లో ఎలా ఉంటారో ఇప్పుడు ఆలాగే ఉంటున్నారు. ఇష్టానుసారంగా బయటకు వస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత, భయం లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. తమ వరకు వస్తే గాని వారిలో మార్పు రాదా? వారు మరీ ఇంత స్వార్థపరులా? కరోనాను అరికట్టడం కోసం ఎవరైతే ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నారో వారికి నా అభినందనలు’అంటూ జేమ్స్ విన్సే పేర్కొన్నాడు. బ్రిటన్‌లో కరోనావైరస్ బాధితుల మరణాలు విపరీతంగా పెరిగాయి. గత 24 గంటల్లో 708 మంది మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడించాయి. దీంతో బ్రిటన్‌లో కరోనా మరణాల సంఖ్య 4,313కు చేరుకుంది. కాగా శనివారం ఒక్క రోజే 3,735 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడ కరోనా బాధితుల సంఖ్య 41,903కు చేరుకుందని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తోపాటు ఆరోగ్య మంత్రికి పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడ్డ ప్రిన్స్ చార్లిస్ చికిత్స అనంతరం కోలుకున్నారు. చదవండి: కరోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం కరోనా: ఈ ఊసరవెల్లిని చూసి నేర్చుకోండి! -
‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’
బ్యాట్స్‌మన్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదు.. బౌలర్ గొప్పదనమేమి లేదు.. ఫీల్డర్ చాకచక్యంగానూ వ్యవహరించలేదు.. కానీ అవతలి ఎండ్‌లో నాన్ స్ట్రయికర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ సిక్సర్స్-మెల్బోర్న్ రెనిగెడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెల్బోర్స్ బౌలర్ విల్ సదర్లాండ్ విసిరిన బంతిని సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ బౌలర్ వైపు బలంగా కొట్టాడు. అయితే బ్యాట్స్‌మన్ షాట్ తప్పి బంతి నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆ బంతిని బౌలర్ అందుకోవడం విఫలమయ్యాడు. కానీ అనూహ్యంగా బౌలర్ జారవిడిచిన ఆ బంతిన నాన్స్ట్రయిక్లో ఉన్న వికెట్లను ముద్దాడింది. అప్పటికే క్రీజు వదిలి ఉన్న నాన్‌స్ట్రయికర్ జేమ్స్ విన్సే రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అసలేం జరిగిందో తెలియక విన్సేతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే రిప్లైలో క్లియర్‌గా చూశాక జేమ్స్ విన్సే భారంగా క్రీజు వదిలివెళ్లాడు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేయగా.. ‘ఈ బీబీఎల్‌లో విన్సే చుట్టు దురదృష్టం వైఫైలా తిరుగుతోంది’అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇక తాజా బీబీఎల్ సీజన్లో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ విన్సేకు ఏదీ కలసిరావడం లేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విన్సే 25.75 సగటుతో 309 పరుగులు సాధించి నిరుత్సాహపరుస్తున్నాడు. అయితే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో 41 నాటౌట్, 51 పరుగులతో ఫామ్‌లోకి వచ్చినట్టు కనపడ్డాడు. కాగా, మెల్బోర్న్ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేసి సత్తా చాటుతున్న సమయంలో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Could James Vince BE any more unlucky?? 😱#BBL09 pic.twitter.com/fJDssdx2FA — KFC Big Bash League (@BBL) January 25, 2020 చదవండి: ‘ఇప్పుడే ఐపీఎల్లో ఆడటం అవసరమా?’ పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం -
తొలి టి20లో ఇంగ్లండ్ గెలుపు
దుబాయ్: పాకిస్తాన్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 14 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (25 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోర్గాన్ (45 నాటౌట్), విన్సీ (41) రాణించారు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటయింది. తన్వీర్ (25) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ, ప్లంకెట్ మూడేసి వికెట్లు తీశారు.