
ఫైల్ ఫోటో
లండన్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే కొన్నిచోట్ల ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. ఇక బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు లాక్‌డౌన్ సక్రమంగా పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపట్ల ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్సే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘ప్రజలు సాధారణ పరిస్థితుల్లో ఎలా ఉంటారో ఇప్పుడు ఆలాగే ఉంటున్నారు. ఇష్టానుసారంగా బయటకు వస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత, భయం లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. తమ వరకు వస్తే గాని వారిలో మార్పు రాదా? వారు మరీ ఇంత స్వార్థపరులా? కరోనాను అరికట్టడం కోసం ఎవరైతే ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నారో వారికి నా అభినందనలు’అంటూ జేమ్స్ విన్సే పేర్కొన్నాడు.
బ్రిటన్‌లో కరోనావైరస్ బాధితుల మరణాలు విపరీతంగా పెరిగాయి. గత 24 గంటల్లో 708 మంది మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడించాయి. దీంతో బ్రిటన్‌లో కరోనా మరణాల సంఖ్య 4,313కు చేరుకుంది. కాగా శనివారం ఒక్క రోజే 3,735 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడ కరోనా బాధితుల సంఖ్య 41,903కు చేరుకుందని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తోపాటు ఆరోగ్య మంత్రికి పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడ్డ ప్రిన్స్ చార్లిస్ చికిత్స అనంతరం కోలుకున్నారు.
చదవండి:
కరోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం
కరోనా: ఈ ఊసరవెల్లిని చూసి నేర్చుకోండి!
Comments
Please login to add a commentAdd a comment