సౌతాంప్టన్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా హాంప్‌షైర్ ఆటగాడు... కెప్టెన్ జేమ్స్ విన్స్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకేరోజు రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో మెరుపు సెంచరీ, హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ముందుగా ససెక్స్, హాంప్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ విన్స్ మెరుపు సెంచరీ సాధించాడు. జేమ్స్ విన్స్ (59 బంతుల్లో 102; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.
మరో 16 పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తామన్న సమయంలో ఓలి రాబిన్‌సన్ బౌలింగ్‌లో దురదృష్టవశాత్తు హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే ససెక్స్‌కు చేయాల్సిన నష్టం చేసే వెళ్లాడు. ఆ తర్వాత జో వెథర్లీ 24 నాటౌట్, లూయిస్ మెక్‌మనస్ 3 నాటౌట్ మిగతా పనిని పూర్తి చేశారు. మరో ఓపెనర్ డీ ఆర్సీ షార్ట్ 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రవి బొపారా 62, లూక్ రైట్ 54 పరుగులు చేశారు.
ఇక హాంప్‌షైర్ ఈసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ జేమ్స్ విన్స్ అర్థసెంచరీతో మెరవడం విశేషం. ఈ మ్యాచ్‌లోనూ విన్స్ టాప్ స్కోరర్‌గా నిలవడం.. హాంప్‌షైర్ మరో విజయాన్ని అందుకోవడం మరో విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విన్స్ 63, డీ ఆర్సీ షార్ట్ 30, గ్రాండ్‌హోమ్ 32 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈసెక్స్ 153 పరుగులకే ఆలౌట్ అయింది. డానియెల్ లారెన్స్ 60, టామ్ వెస్లీ 39 మినహా మరెవరు రాణించలేకపోయారు.
ఇక జేమ్స్ విన్స్‌కు ఈ వారం అత్యుత్తమంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. విన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ఫిఫ్టీలు, రెండు సెంచరీలు అందుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన విన్స్.. అదే జట్టుతో జరిగిన మరో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజాగా టీ20 బ్లాస్ట్‌లో వరుస మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ, సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment