పొట్టి క్రికెట్‌లో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. పవర్ ప్లేల్లో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది హెడ్ పవర్ ప్లేల్లో (టీ20 ఫార్మాట్‌లో) అత్యధిక స్ట్రయిర్‌రేట్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
హెడ్ ఈ ఏడాది ఇప్పటివరకు (పవర్ ప్లేల్లో) 192.32 స్ట్రయిర్‌రేట్‌తో 1027 పరుగులు చేశాడు. ఈ విభాగానికి సంబంధించి హెడ్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. హెడ్ తర్వాత పవర్ ప్లేల్లో ఫిల్ సాల్ట్ అత్యధిక పరుగులు చేశాడు. సాల్ట్ 173.73 స్ట్రయిక్‌రేట్‌తో 827 పరుగులు చేశాడు. సాల్ట్ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్ (156.09 స్ట్రయిక్‌రేట్‌తో 807 పరుగులు), అలెక్స్ హేల్స్ (136.08 స్ట్రయిక్‌రేట్‌తో 792 పరుగులు), జేమ్స్ విన్స్ (124.64 స్ట్రయిక్‌రేట్‌తో 703 పరుగులు) ఉన్నారు.
హెడ్ తాజా ప్రదర్శన విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన టీ20లో చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో సామ్ కర్రన్ వేసిన ఓ ఓవర్లో హెడ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ (59), మాథ్యూ షార్ట్ (41), జోష్ ఇంగ్లిస్ (37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమూద్ తలో 2, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.
180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్ అబాట్ 3, హాజిల్‌వుడ్, జంపా చెరో 2, బార్ట్‌లెట్, గ్రీన్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (37), ఫిలిప్ సాల్ట్ (20), సామ్ కర్రన్(18), జోర్డన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15), సాకిబ్ మహమూద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment