సత్తా చాటిన క్రెయిగ్‌ ఓవర్టన్‌, జేమ్స్‌ విన్స్‌ | The Hundred 2024: Southern Brave Beat London Spirit By 7 Wickets | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన క్రెయిగ్‌ ఓవర్టన్‌, జేమ్స్‌ విన్స్‌

Published Thu, Jul 25 2024 7:32 AM | Last Updated on Thu, Jul 25 2024 9:12 AM

The Hundred 2024: Southern Brave Beat London Spirit By 7 Wickets

పురుషుల ద హండ్రెడ్‌ లీగ్‌లో నిన్న (జులై 24) సథరన్‌ బ్రేవ్‌, లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సథరన్‌ బ్రేవ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లండన్‌ స్పిరిట్‌.. క్రెయిగ్‌ ఓవర్టన్‌ (20-8-16-3), టైమాల్‌ మిల్స్‌ (20-7-37-2), క్రిస్‌ జోర్డన్‌ (15-5-26-2), జేమ్స్‌ కోల్స్‌ (5-3-2-1) దెబ్బకు నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 

లండన్‌ స్పిరిట్‌ ఇన్నింగ్స్‌లో డేనియల్‌ లారెన్స్‌ (30 బంతుల్లో 38; 3 ఫోర్లు), లియామ్‌ డాసన్‌ (19 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా విఫలమయ్యారు. స్టార్‌ ఆటగాళ్లు హెట్‌మైర్‌ (5), ఆండ్రీ రసెల్‌ (13) దారుణంగా నిరాశపరిచారు.

అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్‌ బ్రేవ్‌.. జేమ్స్‌ విన్స్‌ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్‌ హ్యూస్‌ (30 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ల్యూస్‌ డు ప్లూయ్‌ (19 బంతుల్లో 23 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) సత్తా చాటడంతో 89 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లండన్‌ స్పిరిట్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్‌, బొపారా, డేనియల్‌ లారెన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఇదే ఫ్రాంచైజీ మహిళా జట్ల మధ్య నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో లండన్‌ స్పిరిట్‌.. సథరన్‌ బ్రేవ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సథరన్‌ బ్రేవ్‌.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా..లండన్‌ స్పిరిట్‌ మరో మూడు బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హీథర్‌ నైట్‌ (65 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి లండన్‌ స్పిరిట్‌ను గెలిపించింది. అంతకుముందు సథరన్‌ బ్రేవ్‌ ఇన్నింగ్స్‌లో డేనియల్‌ వ్యాట్‌ (59) అర్ద సెంచరీతో రాణించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement