Jason Roy ruled out of the T20 World Cup: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్‌తో సెమిఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్దానంలో జేమ్స్ విన్స్ జట్టులోకి వచ్చి చేరాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ రాయ్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడి 123 పరుగులు చేశాడు.
"ఇది నిజంగా చాలా భాదాకరమైన వార్త. కానీ నేను మా జట్టును సపోర్ట్ చేయడానికి ఇక్కడే ఉంటాను. మేము కచ్చితంగా ట్రోఫీని సాధిస్తాము. ఈ టోర్నమెంట్‌లో నా ప్రయాణం ఎంతో ఆద్బుతమైనది. గాయం నుంచి తొందరగా కోలుకోని కరీబియన్ టూర్‌కు సిద్దంగా ఉంటాను" అని రాయ్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడి 123 పరుగులు చేశాడు. ప్రపంచకప్ లో నవంబర్ 10 న న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగనున్న తొలి సెమీస్ జరగనుంది.
చదవండి: Gautam Gambhir: దయచేసి అర్థం చేసుకోండి.. టీమిండియాను తిట్టొద్దు
Comments
Please login to add a commentAdd a comment