న్యూఢిల్లీ: భారత జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్.. కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఎసెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ప్రో 40 మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో గంభీర్‌ను తీసుకున్నారు. ‘ఎసెక్స్ ఈగల్స్ తరఫున నేటి నుంచి కౌంటీ క్రికెట్ ఆడబోతున్నా’ అని గౌతీ ట్వీట్ చేశాడు. గంభీర్‌తో ఒప్పందం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎసెక్స్ ప్రధాన కోచ్ పాల్ గ్రెసన్ అన్నారు.
చావ్లా కూడా...: లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఈ మేరకు భారత బోర్డు అతనికి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) ఇచ్చింది. ఈ సీజన్‌లో అతను సోమర్సెట్ తరఫున బరిలోకి దిగనున్నాడు. చావ్లా 2009లో సస్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
కౌంటీలకు గంభీర్
Published Fri, Aug 16 2013 1:47 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement