ఎస్సెక్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ షాక్! | Gautam Gambhir leaves Essex for 'family reasons' | Sakshi
Sakshi News home page

ఎస్సెక్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ షాక్!

Published Mon, Sep 2 2013 9:34 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

Gautam Gambhir leaves Essex for 'family reasons'

స్వదేశంలోనే కాకుండా.. ఇంగ్లీష్ క్రికెట్ కౌంటీలో సరియైన ఫామ్ ను ప్రదర్శించలేకపోతున్న భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎస్సెక్స్ జట్టుకు షాకిచ్చాడు. కాంట్రాక్టు పూర్తి కాకుండానే ఎస్సెక్స్ జట్టును మధ్యలోనే వదిలేసి భారత్ బాట పట్టాడు. కుటుంబ కారణాల కారణాలను చూసి ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడుతున్న క్రికెటర్ గౌతమ్ గంభీర్ మధ్యలోనే ఎస్సెక్స్ జట్టును వదిలి భారత్ చేరుకున్నారు.
 
కుటుంబ కారణాల వల్ల ఎస్సెక్స్ జట్టును మధ్యలోనే వదిలి వెళ్లాడని ఎస్సెక్స్ క్రికెట్ జట్టు అధికారులు కూడా వెల్లడించారు. ఆగస్టు నెలలో గౌతమ్ గంభీర్ ఎస్సెక్స్ జట్టుతో చేరాడు. ఎస్సెక్స్ జట్టు తరపున ఆడిన గంభీర్ 31, 21, 2, 0 పరుగులతోపాటు గ్లూసెస్టెర్ షైర్ జట్టుపై సెంచరీ సాధించాడు. భారత జట్టు తరపున గత జనవరిలో ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో గంభీర్ ఆడాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement