English county cricket
-
ఏంటి భయ్యా నీ అదృష్టం.. ఇదేమి ఔట్రా బాబు! పాపం పృథ్వీ
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఇంగ్లండ్ కౌంటీల్లో నార్తాంప్టన్‌షైర్ తరపున అరంగేట్రం చేశాడు. శుక్రవారం రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా గ్లౌసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే విచిత్రమైన రీతిలో పృథ్వీషా ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన పృథ్వీషా హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే? నార్తాంప్టన్‌షైర్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో గ్లౌసెస్టర్షైర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ ఆఖరి బంతిని బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని ఫుల్‌షాట్ ఆడిబోయిన పృథ్వీ.. తన నియంత్రణను కోల్పోయి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి షూ స్టంప్స్‌కు తాకింది. దీంతో ఊహించని రీతిలో పృథ్వీ షా హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి ఔట్‌పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "ఏంటి భయ్యా నీ అదృష్టం, ఎక్కడ ఆడినా ఇంతేనా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పృథ్వీ షా.. తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించకున్నాడు. ఈ క్రమంలోనే నార్తాంప్టన్‌షైర్‌తో జతకట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా పృథ్వీ షా తీవ్ర నిరాశపరిచాడు. చదవండి: Triple Century Hero: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ముగిసిన కెరీర్! అలా ప్రపంచంలో నం.1గా.. HIT WICKET!!!! 🚀 Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34. Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy — Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023 -
అభిమానితో సెల్ఫీ అతనికి శాపంగా మారింది
లండన్ : ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన జోర్డన్ కాక్స్‌పై టీమ్ యాజమాన్యం వేటు వేసింది.కెంట్ జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ కాక్స్.. బాబ్ విల్లీస్ ట్రోఫీ మ్యాచ్‌లో ససెక్స్ టీమ్‌పై 238 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ మ్యాచ్‌లో అతను కోవిడ్19 నియమావళిని ఉల్లంఘించాడు. డబుల్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన 19 ఏళ్ల కాక్స్.. స్టేడియంలో ఓ అభిమానితో సెల్ఫీ దిగాడు. దీంతో అతన్ని మిడిల్సెక్స్తో జరిగే మ్యాచ్‌కు దూరం పెట్టారు. బయో సెక్యూర్, సోషల్ డిస్టాన్సింగ్ నియమావళిని అతను ఉల్లంఘించినట్లు టీమ్ యాజమాన్యం చెప్పింది. (ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు : నెహ్రా) అయితే కోవిడ్19 పరీక్షలో నెగటివ్ వస్తేనే, తిరిగి జోర్డన్ కాక్స్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. ఈ ఘటన పట్ల కాక్స్ క్షమాపణలు చెప్పారు. జోర్డన్ మంచి క్రికెటర్ కానీ అతను ప్రోటోకాల్ బ్రేక్ చేశాడని, అతను కచ్చితంగా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లాల్సిందే అని డైరక్టర్ పౌల్ డౌన్‌టౌన్ తెలిపారు. (ధోనికి వయసుతో సంబంధం లేదు : వాట్సన్) -
కౌంటీ క్రికెట్లో మురళీ విజయ్
భారత సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్లో బరిలోకి దిగనున్నాడు. ఈ నెలలో ఎస్సెక్స్ కౌంటీ తరఫున అతను మూడు 4 రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇంగ్లండ్ టూర్లో ఫామ్‌లో లేక సతమతమవుతున్న అతనికి బీసీసీఐ కౌంటీలాడే ఏర్పాటు చేసింది. ఈ నెల 10 నుంచి నాటింగ్హమ్షైర్తో తొలి మ్యాచ్, 18 నుంచి వార్సెస్టెర్షైర్తో రెండో మ్యాచ్, 24 నుంచి సర్రేతో మూడో మ్యాచ్‌లో విజయ్ బరిలోకి దిగుతాడు. దీనిపై అతను స్పందిస్తూ కౌంటీలాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. -
ఎస్సెక్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ షాక్!
స్వదేశంలోనే కాకుండా.. ఇంగ్లీష్ క్రికెట్ కౌంటీలో సరియైన ఫామ్ ను ప్రదర్శించలేకపోతున్న భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎస్సెక్స్ జట్టుకు షాకిచ్చాడు. కాంట్రాక్టు పూర్తి కాకుండానే ఎస్సెక్స్ జట్టును మధ్యలోనే వదిలేసి భారత్ బాట పట్టాడు. కుటుంబ కారణాల కారణాలను చూసి ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడుతున్న క్రికెటర్ గౌతమ్ గంభీర్ మధ్యలోనే ఎస్సెక్స్ జట్టును వదిలి భారత్ చేరుకున్నారు. కుటుంబ కారణాల వల్ల ఎస్సెక్స్ జట్టును మధ్యలోనే వదిలి వెళ్లాడని ఎస్సెక్స్ క్రికెట్ జట్టు అధికారులు కూడా వెల్లడించారు. ఆగస్టు నెలలో గౌతమ్ గంభీర్ ఎస్సెక్స్ జట్టుతో చేరాడు. ఎస్సెక్స్ జట్టు తరపున ఆడిన గంభీర్ 31, 21, 2, 0 పరుగులతోపాటు గ్లూసెస్టెర్ షైర్ జట్టుపై సెంచరీ సాధించాడు. భారత జట్టు తరపున గత జనవరిలో ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో గంభీర్ ఆడాడు.